Tuesday, October 22, 2013

నదిలో పాదాలు..

 ఒక్కో గీతా చెరిపేస్తూ సున్నా చుట్టేస్తూ
నీ వంక అలా బేలగా

ఒక్కో రేకూ తుంచుతూ ఖాళీగా
నీ వంక అలా వొట్టిగా

ఏమౖందో నదిలో పాదాలు తుళ్ళిపడి
మునివేళ్ళనుండి బిందువులుగా

వాన వెలసి రంగులన్నీ విల్లుగా మారి
నీ వైపు తొంగి చూస్తూ

నువ్వలా కాలం రెక్కల మాటున
పావురాయిలా నిశ్చింతగా

నేనిలా ఈ చివర లేని వంతెన
మీదుగా ఆఖరుగా...

4 comments:

  1. కాలం రెక్కలమాటున నిశ్చింతగా...భ్రమేమోనండి
    టైటిల్ మార్చండి

    ReplyDelete
  2. అద్భుతం మీ ప్రతీ పదం...అందులో దాగి దోబూచులాడే భావం...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...