Tuesday, October 29, 2013

ఋతువు....

అప్పుడే శీత గాలి వీస్తోంది
పావురాయి గూట్లో కుర్ కుర్ మని కలియదిరుగుతూ

ఒక్కో ఆకూ నేలదారి పడుతూ
తురాయి కాయలు వంకీలుగా కత్తిలా వేలాడుతూ

చర్మం మొద్దుబారుతూ పెళుసు బారుతూ
క్రీముల అడ్వర్టైజమెంట్ల గోల మొదలవుతూ

రగ్గులన్నీ దులుపుతూ ఆవిడ మళ్ళీ ఒకసారి
అలమరా అరలు సర్దుకుంటూ

తలుపులేని ఇంటికి తడికయినా లేక
ఆ ముసలి అవ్వ అలా నులకమంచంలో గొణుగుతు

ఋతువేదైనా జీవితం నిండుగా ఇన్ని మడతల
మద్య చినిగిన దుప్పటిలో గాలి చొరబడుతూ వెక్కిరిస్తూంది కదా!!

11 comments:

  1. "కవి వర్మ" గారూ అద్భుతంగా రాసారు.....

    ReplyDelete
  2. శీతాకాలం వచ్చేసింది కదండి.స్వాగతం బాగా పలికారు వర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. శీత కాలమొస్తేనే కానీ మీ దర్శనం కాలేదండీ..:-) ధన్యవాదాలు జలతారు వెన్నెల గారూ..

      Delete
  3. మీరు ఏ విషాయన్నైనా ఇట్టె చెపెస్తారు... మీ secret నాకు కూడా చెప్పండి.. ప్లీజ్..(ష్.. మన మధ్యె ఉంచుతాలెండి)హ్హ..హ్హ.:-):-):-):-)

    ReplyDelete
    Replies
    1. సీక్రెట్ ష్.. మీకు మాత్రమే చెప్తాలెండి :-)
      ధన్యవాదాలు కార్తీక్ గారు..

      Delete
  4. చలికాలంలో వచ్చేసిందన్నమాట :-)

    ReplyDelete
    Replies
    1. రాదా మరి వానకాలం తరువాత.. :-) thank you

      Delete
  5. మీ కవితల్లో చలికాలం చంపేస్తుంది
    మంచుకురిసి మంట రగిలిపోతుంది
    అక్షరం వ్రాయడానికి పెదవి వణికింది
    మెదడు ముసుగుతన్ని పడుకుంది....
    అంటారా? లేక చలి చలిగా గిల్లింది అంటారో చూడాలి :-)

    ReplyDelete
    Replies
    1. hmmmm..

      ఏంటో ఈ కాలమూ ఇలానే మొదలయింది పద్మార్పిత గారూ.. :-)
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...