చీలికలైన ముఖంలోంచి
సున్నితమైన భాగాన్ని తీసుకోగలవా?
గాయాన్నింత కారం పొడి చల్లి
కళ్ళలోకి చూస్తూ ఆరిపోగలవా?
కాగల కార్యాన్నెవడో చేస్తాడులే
అని విరిగిన పాదంతో నక్కి పారిపోతావా?
సగం కాలిన గుడిసెలో
విరిగిపడుతున్న వెన్ను వానకారుతూ
అచ్చంగా అలాగే అదే తీరులో
విరిగిన పాళీతో మళ్ళీ మళ్ళీ రాసే విఫలయత్నం..
ఒక మనసు చేసే పోరాటం....పరిస్థితులను ఎదిరిస్తూ......ఆ పరిస్థితులను తపనతో...స్ఫూర్తితో ... ఎదుర్కొంటున్న వైనం,,,
ReplyDeleteనాకిలా అర్థం అయిందండీ.....did i understood??
.ur wrtings keeps us thinking....without end...' కవి వర్మ ' గారూ.
S u r right anoo gaaru. thanksandi..
Deleteవర్మగారు మీ వెన్నెలదారిలో ఇలాంటి ఆశావాద ధృక్పదాలు మరెన్నో ఆశిస్తూ......చాలా చాలా నచ్చిందండి!
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారూ..
Deleteపాళీ విరగటమా..???? నెవ్వర్ మీ పాళీకి కడగటమే తెలుసు(సమాజ కుళ్ళు ని )
ReplyDeleteవర్మాజీ కవిత చాలా, చాలా నచ్చింది.
నచ్చినందుకు ధన్యవాదాలు ఫాతిమాజీ..
Deleteపరిస్థితులకు అనుగుణంగా అడుగేసే మీరు నాకెప్పుడూ ఆదశమే. అలా అనుగుణంగా మార్చుకునే శక్తి మీకుంది.
ReplyDeleteఏంటో మీరంతా అలా చెప్తూంటే ఆనందంగా వుంది అనికేత్.. థాంక్యూ..
Deleteభలేగా నచ్చేసింది
ReplyDeleteThank you Srujanagaru
ReplyDelete