Thursday, October 17, 2013

విరిగిన పాళీ...

చీలికలైన ముఖంలోంచి
సున్నితమైన భాగాన్ని తీసుకోగలవా?

గాయాన్నింత కారం పొడి చల్లి
కళ్ళలోకి చూస్తూ ఆరిపోగలవా?

కాగల కార్యాన్నెవడో చేస్తాడులే
అని విరిగిన పాదంతో నక్కి పారిపోతావా?

సగం కాలిన గుడిసెలో
విరిగిపడుతున్న వెన్ను వానకారుతూ

అచ్చంగా అలాగే అదే తీరులో
విరిగిన పాళీతో మళ్ళీ మళ్ళీ రాసే విఫలయత్నం..

10 comments:

  1. ఒక మనసు చేసే పోరాటం....పరిస్థితులను ఎదిరిస్తూ......ఆ పరిస్థితులను తపనతో...స్ఫూర్తితో ... ఎదుర్కొంటున్న వైనం,,,
    నాకిలా అర్థం అయిందండీ.....did i understood??
    .ur wrtings keeps us thinking....without end...' కవి వర్మ ' గారూ.

    ReplyDelete
  2. వర్మగారు మీ వెన్నెలదారిలో ఇలాంటి ఆశావాద ధృక్పదాలు మరెన్నో ఆశిస్తూ......చాలా చాలా నచ్చిందండి!

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారూ..

      Delete
  3. పాళీ విరగటమా..???? నెవ్వర్ మీ పాళీకి కడగటమే తెలుసు(సమాజ కుళ్ళు ని )
    వర్మాజీ కవిత చాలా, చాలా నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. నచ్చినందుకు ధన్యవాదాలు ఫాతిమాజీ..

      Delete
  4. పరిస్థితులకు అనుగుణంగా అడుగేసే మీరు నాకెప్పుడూ ఆదశమే. అలా అనుగుణంగా మార్చుకునే శక్తి మీకుంది.

    ReplyDelete
    Replies
    1. ఏంటో మీరంతా అలా చెప్తూంటే ఆనందంగా వుంది అనికేత్.. థాంక్యూ..

      Delete
  5. భలేగా నచ్చేసింది

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...