Friday, October 11, 2013

నీడలో దాగిన ముఖం...విసిరేసినతనమేదో
ఒంటరిగా దెయ్యంపట్టులా
మదిగుబురులో వేలాడుతూ

అందిన చేయి
పొడిగా గరకుగా
అరచేయి చాళ్ళగుండా
ఏదీ ప్రవహించలేనితనంతో

మాట కూర్చలేని దారంగుండా
జీవితపు సూది బెజ్జంలోంచి
కన్ను మూగగా రోదిస్తూ

ఒక్కసారిగా మీదపడ్డ
నల్ల దుప్పటి నేలమాళిగలో
నన్ను ఓదారుస్తూ
పాడుతున్న లాలి పాటలా

అసంతృప్తిగా అరాచకంగా
అబ్సర్డ్ గా గోడపై బొగ్గుతో
రాస్తున్న నినాదం ఊచల
నీడలో దాగిన ముఖం పై నువ్
చేసిన నెత్తుటి గాటు

అతకని పదాల మధ్య జిగురుగా
కాసింత ఉమ్మనీటినలా ఒలకనీ...


(తేదీ: 11/10/2013 - 7.30PM)

6 comments:

 1. వర్మగారు...ఈ పదాలన్నీ మీరు ఎన్నోమార్లు పరిచయం చేసారు, అయినా.....మీ ప్రతి కవితతో కరచాలం చేసిన ప్రతిమారు ఏదో క్రొత్తదనం, నూతన పరిచయంలా అనిపిస్తుంది!!! అందుకేనేమో మీ కవితలకై కళ్ళు వెతుకుతుంటాయి.

  ReplyDelete
  Replies
  1. నా రాతలన్నీ గొలుసు కట్టుగా కొనసాగుతాయి కదండీ.. ఆ పదాల దారాల మద్య ఇదొకటి.. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..

   Delete
 2. మీ భావపదజాలం కాస్త కష్టమైనా ఇష్టమే అనిపిస్తుంది :-)

  ReplyDelete
  Replies
  1. మీరలా ఇష్టంగా చదివి ఇలా ఆత్మీయంగా స్పందిస్తే చాలండీ ప్రేరణ గారూ.. :-)

   Delete
 3. అసంతృప్తిగా అరాచకంగా
  అబ్సర్డ్ గా గోడపై బొగ్గుతో
  రాస్తున్న నినాదం ఊచల
  నీడలో దాగిన ముఖం పై నువ్
  చేసిన నెత్తుటి గాటు...super sir

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...