నువ్వొక్కరివే...
ఇన్ని అపరిచిత ముఖాల మద్య నువ్వొక్కరివే
దోసిలిలోని నీళ్ళను అలా ముఖంపై చల్లుకొని దుఃఖాన్ని కడిగే ప్రయత్నం చేస్తూ
రాలిన పూలకు అంటిన నెత్తురిని తుడుస్తూ
తెగిన రెక్కను సవరిస్తూ
పలాస్త్రీలాంటి నవ్వుతో
నవ్వులాంటి వెలుగుతో
వెలుగులాంటి వెన్నెలతో
కాసింత పలకరింపు పసుపుదనంతో
ఈ సాయంత్రాన్ని ఆరామంగా మారుస్తూ
నువ్వొక్కరివే....
దుఖాన్ని కడిగే ప్రయత్నం చేస్తూ....నవ్వులు పులుముకున్నా...వెలుగులు నింపుకున్నా .....పలకరించినా....అందరి నడుమా ఒంటరేగా....
ReplyDeleteఅద్భుతం గా రాసారు 'కవి వర్మ' గారూ...అభినందనలు.
మీ ఆత్మీయ 'అను'రాగ పలకరింపునకు ధన్యవాదాలండీ..
Delete