ఒక్కో సారంతే...
అలా నడుస్తూ వుంటాం
గట్ల మీదుగా దుక్షిణిపుల్లల విత్తులంటుకోని వదలనట్టుగా
అర చేతులకు గీర్లు పడుతూ
చెప్పులతో పాటు అరికాళ్ళనిండా ఇంత ఒండ్రు మట్టి అంటుకొని
ఎన్ని నీళ్ళతో కడిగినా ఏదో జిగురుగా ఇంకా వదలనట్టుగా
ఒక ఎఱని చార అగుపడుతూ
అర చేతులగుండా వేళ్ళ మధ్యనుండి జారుతున్న దారాన్ని ఆసరాగా
ఎగరేసిన గాలిపటం ఆకాశపుటంచులు తాకుతున్న సమయంలో
తెగిపోయిన తోకచుక్కలా నేలరాలుతూ
కిల కిల మని బాతులగుంపొకటి చెరువునిండా ఈదుతూన్న సమయంలో
ఒక్కసారిగా గండిపడి ఇంకిపోయిన చెరువు గర్భంలో
బురదలో కూరుకుపోతూ
కళ్ళ ముందు పరచుకున్న పచ్చదనం ఒక్కసారిగా ఎడారైనట్టు
గుండెలోతుల్లో ఏదో బెంగ.. కూతురు తన వేలి చివర వదిలిపెట్టి వెళ్తూ
ఇంత పిరికిదనాన్ని మూటగడుతూ
కొన్ని సమయాలు కొన్ని ఏకాంతాలను కలగలుపుతూ యింత ఒంటరితనాన్ని
గుంపులోంచి తీసి మీద జల్లి చినుకులన్నీ ఆవిరయి నల్ల మబ్బేదో
కళ్ళ మద్య కలల్ని కత్తిరిస్తూ
(తే 27-09-2013 దీ రాత్రి 11.11)
EXTRAORDINARY!!!
ReplyDeleteఒక్కోసారంతే.... అక్షరాలన్నీ అడ్దంతిరిగి, భావాలన్నీ గోలచేసి వేదనని వేదికనెక్కిస్తాయి.లేదా మూతపడని కనురెప్పలు కలలని వెక్కిరిస్తుంటాయి. ఒక్కొసారంతే కవులకే అలా అనిపిస్తుంది.:-)
ReplyDeleteనిజమేనన్నమాట.. థాంక్యూ ఫాతిమాజీ..
Deleteవేదన క్షణక్షణాన ఆవేదనగా కలలన్నీ నా కనుల నుండి కరిగిపొతూ
ReplyDeletethank you anju garu..
Delete