ముసురు...
ఆలోచనల తేనెటీగల ముసురు
పట్టులో మాయ మవుతున్న తేనె
ఆకు చివర చీమల ఉసుళ్ళ పట్టు
పగలని గుడ్డులో పిల్ల చీమ విల విల
తెలవారని రాత్రిలా రోజు దీర్ఘ నిశ్వాశ
ఎగబాకుతున్న చెద మెదళ్ళని తొలుస్తూ
బొంత కుట్టులో కప్పని చిరుగు పోగు
రాలిపడని పండుటాకు చివర నీటి బొట్టు
అసంగత సంగతాల మేళవింపు
సార్ మీకు ఇలాంటి అద్భుతమైన వాక్యాలు ఎలా తడతాయండి భలేరాసారు
ReplyDeleteYohanthji యెన్నాళ్ళకు మీ రాక. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ..
ReplyDeleteవేదనైనా భావమైనా మీరు చెప్పే విధానమే వేరు వర్మగారు...ఓ పట్టాన అంతుచిక్కరు :-)
ReplyDeleteచిక్కుదామనే రోటీ తింటున్నా తగ్గడం లేదు ప్రేరణ గారూ.. ప్చ్ :-)
Deleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ..
ఎడతెగని ఆలోచనల ముసురుకు ప్రతిరూపం ఈ కవిత. అక్షర ముత్యం.
ReplyDeleteమీ మాట ముత్యాల మూట ఫాతిమాగారూ.. ధన్యవాదాలు.
Deleteఇది వట్టి ముసురు కాదు , ఉసురు ( ప్రాణం ) ముసురు .
ReplyDeleteధన్యవాదాలు శర్మ గారు...
Deleteమీ విశ్లేషణాత్మక స్పందనకు..
ఎందుకో మీ ఈ కవితకి కమెంట్ పెట్టాలంటే చేయి వణుకుతుంది....అత్యంత అద్భుతం
ReplyDeleteఅబ్బా అలా అంటే తిడుతున్నావో పొగుడుతున్నావో తెలీడం లేదు అనికేత్.. మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు. నిర్మొహమాటంగా చెప్పు మరి ఎప్పుడూ :-)
Deleteఎప్పటిలాగానే అక్షరాలతో ఆడుకున్నారు.
ReplyDelete