కొన్ని అసంకల్పితాలు...
కొన్ని క్షణాల్ని ఒడిసి పట్టుకొని
జేబు కింది గుండెలో పొట్లం కట్టా
చేతిలో ఇన్ని గులక రాళ్ళని
తీసుకొని చెరువు గట్టుపై నడుస్తు
గాలి కోతకు ఊగుతూ రాలుతున్న
ఆకులను ఏరుకుంటూ ప్రేమగా తాకుతూ
మబ్బు కుండ ఖాళీ అవుతూ
ఆఖరి చినుకు కనురెప్పపై పడుతూ
రెక్క తెగిన తూనీగ ఒరిగిపోతూ
దోసిలి నిండా నెత్తుటి మరక
చిత్రంపై ఒలికిన రంగు కాన్వాసు
మీదుగా మొఖంపైకి పాకుతూ
విరిగిన వేణువు నుండి నిషిద్ధ
రాగమేదో గొంతులోకి ఒలుకుతూ
పాదాలను తాకుతున్న గడ్డి పరకల
తడి గుండెలోకి జారుతూ
పదిలంగా దాచుకున్న నెమలీకలు
వదిలిన బియ్యపు గింజలు మెరుస్తూ...
చాన్నాళ్ళకి మీ పదాల పరిమళాన్ని మొత్తం గుప్పించారు కుమారవర్మగారు.
ReplyDeleteమీ అభిమాన స్పందన స్ఫూర్తిదాయకం ప్రేరణ గారూ ధన్యవాదాలు..
Deleteవడసి పట్టుకున్న ఆ కొన్ని క్షణాలే, భావుకతకు ఊపిరిపోస్తాయి. నిరాసక్తగా సాగే కాలాన్ని ముందుకు నడిపిస్తాయి. వర్మగారూ, కవిత చాలా బాగుంది.
ReplyDeleteమీరిలా చెప్తే నిజమే మరి ఫాతిమాజీ.. థాంక్యూ..
Delete"మబ్బు కుండ ఖాళీ అవుతూ
ReplyDeleteఆఖరి చినుకు కనురెప్పపై పడుతూ
రెక్క తెగిన తూనీగ ఒరిగిపోతూ
దోసిలి నిండా నెత్తుటి మరక"
ఇలాంటి వాక్యాలతో కవితని సున్నితంగా మలచడం మీ ప్రత్యేకత.
అవునా మీరు నచ్చి ప్రత్యేకంగా చెప్పినందుకు థాంక్యూ అనికేత్ గారూ..
Deleteచదువుతున్నా చదువుతున్నా....చదుతూనే ఉన్నా, బహుశా మీ సున్నిత పదజాలానికి దాసోహమైన అసంకల్పిత ప్రతీకారచర్య కామోసు!
ReplyDeleteవావ్..
Deleteఅది ప్రతీకార చర్య కాదేమో కదా?? మీ హృదయ సున్నితత్వ ప్రతిఫలం కావచ్చు పద్మార్పిత గారూ.. అభివందనాలు..
Beautiful feel....
ReplyDeleteThanks a lot అనూ గారు..
Delete