కర్ణుడినే..
అమ్మా!
నీ దేహంపై ఇన్ని శుక్ర కణాలు
విసిరేసి పోయాడు వాడు
నీ నిశ్శబ్ద రోదన ఎవరి
చెవికీ చేరలేదు కదా
పేగు తెంచుకు పుట్టిన నన్ను
దోసిట్లోంచి ఇలా నీళ్ళ పాలుజేసావు
కాలమనే మొసలి నోట చిక్కి
నాకు నేనే కర్ణుడనయ్యాను
అడిగిన వారికి కాదనక
అర్పించే బుద్ధి నీదే కదా
ఒక్కొక్కడూ నన్ను
చీల్చుకు తిన్నవాడే
కులమూ గోత్రమూ అప్పుడడ్డు
రాలేదు వీళ్ళ సిగ్గులేనితనానికి
చివరకు చనుబాలివ్వని నీకూ నా
ప్రాణాలే వరమయ్యాయి
అమ్మా యింక
మరల మరల మమ్మల్ని కనొద్దు
భూమ్మీద పడ్డ క్షణం నుండీ
క్షత గాత్రున్నే కదా?
అయినా నీ ఎద దోసిలిలో
నేనెప్పటికీ కర్ణుడినే కదా??
(నా హీరో కర్ణుడే)
ఎవడో శుక్ర కణాలు విడిచినందున , తనని కని పారేసిందనటం వాస్తవమే అయినా అలా వ్రాయటం
ReplyDeleteచాలా చాలా బాగుంది .
అంతే కాదు " అమ్మా యింక
మరల మరల మమ్మల్ని కనొద్దు "
అనటం ఇంకా ఇంకా బాగుంది .
మీకు నచ్చినందుకు ధన్యవాదలు శర్మ గారు..
DeleteYes...he is a real hero!
ReplyDeleteమీరూ హీరో అన్నందుకు థాంక్యూ పద్మార్పిత గారూ..
Deleteఅవును హీరోయే. హీరోలకే హీరో. అందుకే కర్ణుడు లేని భారతం లేదంటారు. తల్లి (కుంతి) అభ్యర్ధనకి ఇచ్చిన జవాబు వెనక అతనిలో ఉన్న బాధ కనిపిస్తుంది.
ReplyDeleteధన్యవాదాలు నరసింహారావు గారు..
Deleteమీ బాటలోనే నా పయనం...:) నా హీరో కూడా కర్ణుడే
ReplyDeleteOh.. thank you Aniketh...:-)
Deleteకర్ణుని లో ఓ విదమైన కసి, విరక్తి భావన చాలా సార్లు కనిపిస్తుంది భారతం లో . బహుశా తన జననం కారణం కావచ్హు, అప్పటికీ ఇప్పటికీ,ఇక యెప్పటికీ మారనిది స్త్రీ పరిస్థితి, మీరు అక్షరించిన భావాలు సూటిగా, నిక్కచ్హిగా ఉన్నాయి. వర్మ గారూ కవిత చాలా బాగుంది.
Deleteథాంక్సండీ ఫాతిమాజీ..
Delete