Monday, August 5, 2013

వెలుగు వంతెన


నిరీక్షించే నీ కనులలో 
వెలుగు వంతెన కానా??

ఈ మలుపులో 
ఆశల దారం కానా??

మబ్బు తునకను తుంచి
చినుకునై కురవనా??

వెన్నెల నురుగును అద్ది
చెక్కిలిపై మెరవనా??

మౌనపు శూన్యాన్ని మింగి
రాగాల పల్లకి కానా??

పాదాలనంటిన చెమ్మను తాకి
ఎదపై ముద్రను కానా??

5 comments:

  1. వెన్నెల నురుగు...మౌనపు శూన్యం...ఎంత అపురూపంగా అనిపిస్తాయో మీ మాటల భావాలు...మళ్ళీ మళ్ళీ తలుచుకునేలా....
    అద్భుతం మీ వెలుగు వంతెన...'కవివర్మ'గారూ

    ReplyDelete
  2. చాలా బాగుందండి.

    ReplyDelete
  3. కానా? చేయనా? అడి చేసేవారు ఆత్మీయులు కారేమో కవివర్మగారు :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...