Thursday, August 15, 2013

సొతంత్రమొచ్చేసిందోచ్...

మీ వారసత్వం
కొనసాగుతూనే వుంది
నెత్తురింకిన నేలలో
ఇంకా తడిగా
జిగటగా

నాటి డయ్యర్
నేడు రాజయ్యాడు
తెలుపు నలుపుల
మిశ్రమంలో

కుట్ర కేసులూ
కొనసాగుతూ....నే
వున్నాయి

కోవర్టులు
అప్రూవర్లు
గిరీశాలు
మా చుట్టూ
కొలువుదీరే
వున్నారు

పేదరికం
పరారయిందని
వెన్నుకంటిన
కడుపుతో
గట్టిగా
చప్పట్లు
చరుస్తాం
ఆరోగ్యశ్రీలు
ఉపాధి హామీలు
ఆధార్ కార్డులు
పెన్షన్లు
రేషన్ కార్డులు
కేస్ట్ సర్టిఫికేట్ల
కోసం
మోకాళ్ళపై
నిలబడతాం

వాడి
కరకరమనే
ఖద్దరు
చొక్కా
ముందు
తలపాగా
నడుముకు
చుట్టి చేతులు
జోడిస్తూనే
వున్నాం

సూది బూట్ల
వైట్ కాలర్
వాడి ఎదుట
జీ హుజూరంటూనే
వున్నాం

మా
దేహమంతా
నిరోధ్
తొడుక్కునే
వున్నాం

ఏదేమైనా
ఏమైపోయినా
ఎవడు చచ్చినా
చంపబడినా
నడిరోడ్డుపై
అత్యాచారం
జరిగినా
మా
గూడు
పదిలంగా వుంటే
పదివేల
దణ్ణాలు

తిరుపతి
వెంకన్నకు
ప్రతి ఏడాది
మొక్కు చెల్లిస్తూనే
వున్నాం

ఏమైనా
ఎవరైనా
ఈ బతుకేందిరా
అంటే గింటే
మిడిల్ క్లాస్
కదటోయ్
ఇంతకంటే
ఏంజేయగలమని
హ్హి హ్హి హ్హి అని
పళ్ళికిలించేస్తాం

అప్పుడప్పుడు
మా సిగ్గులేని
ముఖాలతో
మీ ముందుకు
ఇలా
ఒక్కసారి
అని
తృప్తిపడనివ్వు
......
సొతంత్రమొచ్చేసిందోచ్!!!!
జై భారత్
ఇంక్విలాబ్ జిందాబాద్...

12 comments:

  1. "దేవుడు దిగి రానీ ఎవ్వరు ఏమైపోనీ ,మారదు లోకం మారదు కాలం ..."
    సిరివెన్నెల గారి పాట గుర్తుకు వచ్చింది మీ కవిత చదవగానే!
    కవిత, అందులో ఉన్న అవేదన మనసును తాకింది. బాధ కలిగింది.
    అభినందనలు మీకు వర్మ గారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జలతారు వెన్నెల గారు

      Delete
  2. Very inspiring...emotional....who else can express da feel other than 'kavivarma' garu...
    May this throw out da escapism from everyone's inner soul.....

    ReplyDelete
  3. ఇలాగే ఉండేవాళ్ళం
    ఉన్నాము, ఇకముందు ఉంటాం.... చక్కగా కూర్చారు.

    ReplyDelete
  4. అభినందనలు వర్మగారు, చాలా బాగుంది. జైహింద్

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ అనికేత్ గారు.. జై భారత్..ః-)

      Delete
    2. ఆలోచనలో మార్పు రానంత వరకూ వ్యవస్థ మారదు, మనిషిలో స్వార్ధం ఉన్నంత వరకూ ఆలోచన పరిపక్వత చెందదు. పోనీయండి కొన్ని తరాలను ఇలాగే...ఆకలికి కేకలు కూడా వేయలేని రోజు వస్తుంది అప్పుడు జనజీవనానికి విలువ పెరుగు తుందేమో.

      Delete
    3. నిజమే మీరన్నది ఫాతిమాజీ..
      మార్పు కోసం ఆరాటం పోరాటం తప్పవు కదా.. థాంక్యూ

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...