మాటలన్నీ నిశ్శబ్దాన్ని కావలించుకొని
గొంతు దాటని స్వరమేదో మూగగా ఆలపిస్తూ..
పారుతున్న నదీ పాయ ఒక్కసారిగా
ఇసుక తిన్నెలోకి జారిపోతూ...
అరచేతుల గుండా ప్రవహించిన
విద్యుత్ వేలి చివరనే ఆవిరవుతూ...
ఒక్కో క్షణం వానలో తడిసిన
మట్టి గోడలా కరిగిపోతూ..
ఎండుటాకును తాకిన వాన
తడి జారిపోతూ…
జ్నాపకాలేవి మిగుల్చుకోలేని
నీ నిస్సహాయత...
నీ మౌనపు భారాన్ని మోయలేని
నా అసహాయత...
ఎదురెదురుగా కూలబడ్డ
రాతి బొమ్మల కొలువు...
(వాకిలి ఈ-పత్రికలో ప్రచురితం)
ప్రతి పదం చాలా బావుందండి ఎంత బావుందండి మీ భావాల మాలిక అభినందనలు
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు మంజుల (చెప్పాలంటే) గారూ..
Deleteజ్నాపకాలేవి మిగుల్చుకోలేని
ReplyDeleteనీ నిస్సహాయత...
నీ మౌనపు భారాన్ని మోయలేని
నా అసహాయత...
ఎంతటి లోతైన భావాన్ని పలికించారు మీ మాటల్లో..."కవివర్మ"గారూ
అద్భుతమైన కవిత.
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ అనూ గారూ...
Deleteనిగూఢభావాల నిధి మీ ప్రతి అక్షరం.
ReplyDeleteమీ పలుకు స్ఫూర్తిదాయక౦ పద్మార్పిత గారూ.. ధన్యవాదాలు..
Deleteమాటలన్నీ నిశ్శబ్దాన్ని కావలించుకొని
ReplyDeleteగొంతు దాటని స్వరమేదో మూగగా ఆలపిస్తూ..
స్వరం మూగబోయి పదాలు ఏరులై పారుతున్నాయి కామోసు :-) చక్కగా రాసారు.
meerilaa preranagaa maataadutunte alaage kaamosu..:-)
DeleteThanks a lot prerana gaaru..