Friday, July 26, 2013

మృత పెదవులు


గదంతా పరచుకున్న చీకటి దీపపు కాంతిలో 
సన్నని నల్లని మెరుపు

కంటిపాప నలుపులో దాగిన
వెలుతురే కనిపిస్తోంది

అక్షరం చుట్టు పరచుకున్న వెలుగు 
వలయంలా

మాటల చుట్టూ అల్లుకున్న లోలోపలి
పరిమళంలా

చమురు ఇంకిన దీపపు ఒత్తి చివరి
మెరుపులా

గంధమేదో పూసినట్టు రాజుకుంటున్న
నిప్పు కణికలా

నువ్వలా దోసిలిలోకి రాగానే వేళ్ళ సందులగుండా
కరిగిపోతూ 

దాహార్తితో నెత్తురు చిమ్మిన గొంతులోంచి రాగమొకటి 
రాలిపడుతూ

వానలో తడిచిన కాగితప్పడవ మునకేస్తూ
చిరిగిపోతూ

మృత పెదవులపై కురిసిన చినుకు
తడి కోల్పోతూ

అసంపూర్ణంగా వదిలేసిన వర్ణ చిత్రంలా 
ఇలా వెలిసిపోతూ

8 comments:

  1. కవితల్లో ఎలాగో విషాదం గుప్పిస్తారుగా
    బొమ్మ కూడా ఎండిపోయిన ఆకేగా....
    కనీసం టైటిల్ అయినా కాస్త నవ్వొచ్చుగా :-)
    ఏమైనా కవిత మీదైన శైలిలో మాబాగా నచ్చేసింది!

    ReplyDelete
    Replies
    1. ఏంటో అలా పదాల మద్య ఆ ఎండినతనమే వెంటాడింది పద్మార్పిత గారూ..
      మరో సారి మీ ఆత్మీయ సలహా పాటిస్తాను :-)

      ధన్యవాదాలు..

      Delete
  2. 'కవివర్మ " గారూ అద్భుతం మీ భావ వ్యక్తీకరణం...ఇంతకన్నా మనసులోని విషాదాన్ని ఎవరు పోల్చగలరు..మనసు భారమైంది..No words to praise ur poetry...amazing!

    ReplyDelete
  3. నలుపులో వెలుగు చూపించారు ..
    .
    మృత పెదవులపై కురిసిన చినుకు
    తడి కోల్పోతూ

    అసంపూర్ణంగా వదిలేసిన వర్ణ చిత్రంలా
    ఇలా వెలిసిపోతూ....ఎంత చక్కటి భావం అండి అభినందనలు మీకు

    ReplyDelete
  4. చక్కని భావంతో చిక్కగా వ్రాశారు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...