Tuesday, July 9, 2013

ఆవలివైపు...



ఇలానే
ఇప్పటిలాగే
ఒక్కో క్షణం కోల్పోతూన్న
ప్రతి సారీ నన్ను వెంటాడే ప్రశ్న ఇదే

ఆవలివైపు మిగిలేదేముందని??
 
వేటాడే ప్రశ్న
వేట కొడవలిలా మెడవైపు దూసుకొస్తూ...

ఏదీ శాశ్వతం కాదన్న సత్యం
ఏదీ శాశ్వత సత్యం కాదన్న నిజం
ఏదీ నిత్యమూ కాదన్న నిష్ఠురం

ఈ వేధింపు మనసు సంధులలోనుండి
సుళ్ళు తిరుగుతూ అద్దం ముందు
నిరక్షర నిరుత్తరనౌతూ...

8 comments:

  1. Superb! చాలా బాగుంది వర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. Thank you జలతారు వెన్నెల గారు..

      Delete
  2. Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ మంజు (చెప్పాలంటే) గారు..

      Delete
  3. ఏదీ శాశ్వత సత్యం కాదన్న నిజం...ఒప్పుకుని తీరాల్సిందే..ప్రతీ క్షణం.
    ఇంతకన్నా అద్భుతంగా ఎవరు చెప్పగలరు 'కవివర్మ' గారూ. నిష్టూరమైన నిజాన్నే చెప్పారు.

    ReplyDelete
  4. naa kante adbhutangaa yento mandi cheptaaru anoo gaaru.. yedo naa godava ilaa.. mee abhimaana spandanaku dhanyavaadaalu..

    ReplyDelete
  5. చాలాబాగుంది వర్మగారు.

    ReplyDelete
  6. మీ ఆత్మీయ స్పందనకు థాంక్సండీ పద్మార్పిత గారు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...