కొన్ని మాటలు
చెవిలో దూరినా మనసులో ఇంకవు
కొన్ని మాటలు
దూలం కంటే పెద్దగా అయి లోపలికి రాలేవు
కొన్ని మాటలు
ముళ్ళులా మారి దేహంతో పాటు మనసును గుచ్చుతాయి
కొన్ని మాటలు
ఆత్మీయంగా పలకరించి జీవం పోస్తాయి
కొన్ని మాటలు
తొలకరి చినుకులా కురిసి చిగురు వేస్తాయి
కొన్ని మాటలు
వెన్నెల చల్లదనాన్ని పంచి ప్రశాంతతనిస్తాయి
కొన్ని మాటలు
రక్తాన్ని మరిగించి కరవాలాన్నందించి యుద్ధోన్ముఖున్ని చేస్తాయి
కొన్ని మాటలు
నిన్ను అంతర్ముఖున్ని చేసి సుషుప్తిలోకి నెట్టి స్వాంతననిస్తాయి
కొన్ని మాటలు
రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి
కొన్ని మాటలు
అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి...
కొన్ని కవితలు
ReplyDeleteచదివిన వెంటనే "భలే" అనిపిస్తాయి...
బాగుంది వర్మ గారు
ధన్యవాదాలు జలతారు వెన్నెల గారు..:-)
Deleteకొన్ని మాటలేంటండి ఇవి వర్మగారు.......మనసుగూటిలో దాచుకోవలసిన రత్నాల మూటలు
ReplyDeleteమీ మాటలిలా స్ఫూర్తినిస్తూనే వుండాలి పద్మార్పిత గారు.. ధన్యవాదాలు..
Deleteఅమ్మ చనుబాలలా మళ్ళీ మనిషిని చేసే మాటలు లిఖించే కేక్యూబ్ వర్మగారు ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నోరాయాలని,రాసి రాశి పోయాలని........
ReplyDeleteమీ ఆత్మీయ మాటలు స్ఫూర్తిదాయకం సూర్యప్రకాష్ గారు.. ధన్యవాదాలు..
Deleteమాటేమంత్రమూ....
ReplyDeleteనిజమే కదా!! థాంక్యూ కష్టేఫలే గారు..
Deleteఅప్పుడప్పుడూ ఇలా ఓ నాలుగు మంచిమాటలు రాయండి.
ReplyDeleteమీరిలా చెప్పాలే కానీ తప్పకుండా ట్రై చేస్తా సార్.. ధన్యవాదాలు..
Deleteమాటల్లోని మర్మాన్ని మహా గమ్మత్తుగా చెప్పారు :)
ReplyDeleteఅవునా!! ఇందులో గమ్మత్తేముంది అనికేత్.. మత్తు లేకుండా చెప్పినవే..
Deleteథాంక్యూ..:-)
మీ రాతలు మాటలు కూడా బాగుంటాయి :-)
ReplyDeleteఅవునా.. ధన్యవాదాలు తెలుగమ్మాయిగోరూ...:-)
Deleteనిజమే వర్మ గారూ, కొన్ని మాటలు జీవితాన్ని చిగురింపచేస్తాయి, మీ ప్రతిమాటా బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమాజీ..
Deleteమీ మాటలకేమండి....మాచక్కగా చెప్తారు కవితలరూపంలో.
ReplyDeleteమీ అభిమానమండీ సృజన గారు.. చాలా రోజులకు మీ స్పందన. ధన్యవాదాలు..
Deleteee "maatalu" naakentho prerananistunay...
ReplyDelete"మీ మాటలను ముద్దాడి నప్పుడల్లా ....తెలియని సంతోషం....
ReplyDeleteమీ మాట ల వొరవడి ని ..ఇలానే కొనసాగించాలి " అబినందనలు ...వర్మ గారు ..
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు కరుణ సాగర్ గారు..
Delete"మీ మాటలను ముద్దాడి నప్పుడల్లా ....తెలియని సంతోషం....
ReplyDeleteమీ మాట ల వొరవడి ని ..ఇలానే కొనసాగించాలి " అబినందనలు ...వర్మ గారు ..