వాన రేక...
వెలుతురునింత
పిడికిట్లో పట్టి
కళ్ళకద్దుకుని
బలంగా
ఆకాశంలోకి
విసిరా
నలుదిశలా
మిరుమిట్లు
గొలుపుతూ
ఇన్ని
అక్షరాలను
వెదజల్లింది
హృదయమంతా
పరచుకుంటూ
దేహం
గాలిపటంలా మారి
తోకచుక్కలా
దూసుకు
పోతూంది
వాన రేక
తడితో
విచ్చుకున్న
విత్తనం
నేలమ్మా
నీ
ఒడిలో
చేరిన
ఈ
మొలకనిలా
చివురించనీ
Amazing!! Great feel.
ReplyDeleteఏపుగా ఎదిగి మీ కనులకింపుకావాలని.....:-)nice feel
ReplyDeleteఈ కవితలో అందమైన పదాల అల్లిక అపురూపం.
ReplyDeleteమంచి భావ వాహిని.
ReplyDeleteఅనూ గారు, పద్మార్పిత గారూ, అనికేత్, సృజన గారు అందరికీ ధన్యవాదాలు. మీ స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యానాలతో నాకింత ప్రేరణనిస్తున్నందుకు కృతజ్ఞున్ని..
ReplyDeleteNice sir.
ReplyDeleteథాంక్యూ యోహాంత్ జీ...
Delete