పక్షి రెక్కల టప టపల నుండి
రాలిన చినుకుల రంగు
దేహమంతా
సీతాకోక చిలుక రెక్కల నుండి
జారిపడిన పుప్పొడి
కనురెప్పల మీద
వరి పైరు మీదుగా వీచిన
గాలి పచ్చగా
పరిసరమంతా
తడిచిన మట్టి పరిమళం
కోనేటి మీదుగా
అలలు అలలుగా
రంకె వేస్తున్న కోడెద్దు కాలి
గిట్టల నుండి ఎగిరిన
ధూళి ఎర్రగా
సుదూరంగా వెదురు వనాల
నుండి గాయపడ్డ
రాగమేదో కోస్తూ
పడమటి కొండ గొంతులో
భారంగా సూరీడు
ఆత్మహత్య
ముఖం చూపలేని వెన్నెల
దు:ఖాన్ని దోసిలిలో
ఒంపుతూ
అద్భుతం....మీ శైలి...భావం...
ReplyDeleteథాంక్సండీ అనూ గారు..
Deleteభావం ప్రకృతి తో పోటీ పడుతుంది, ముభావం గానే చాలా చెపుతుంది. మీదైన శైలిలో చాలా బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమాజీ...
Deleteadbhutham gaa vraasaarandi
ReplyDeleteధన్యవాదాలు శ్రీదేవి గారు..
Deleteఅంత అందమైన వర్ణనలో ఆ చివర్న విషాదఛాయలెందుకో...వర్మగారికి విషాదం అత్యంత ప్రియం కాబోలు.:)
ReplyDeleteవిషాద యోగం అనికేత్... :-) థాంక్స్ ఫర్ యువర్ కైండ్ కాంప్లిమెంట్..
Deleteఅందమైన కవితా హరివిల్లులా ఉందండి. చాలా బాగుంది!
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..
Deleteమీ కవితను చదవటం యిదే ప్రధమం . సింపుల్ & బ్యూటిఫుల్ .
ReplyDeleteThank you Sharma garu. Plz go through my blog..
Deleteచిన్ని చిన్ని పదాలతో చక్కగా అలరించారు.
ReplyDeleteధన్యవాదాలు తెలుగమ్మాయి గారు
Deleteఫోటో చూసి ఏదో పక్షులపై పడ్డారు కామోసు అనుకున్నా....ప్రకృతి అందాల్లో మీ వేదన మీదైన పద్దతిలో పండిచారుగా ;-)
ReplyDeleteపక్షులపై పడాలంటే నేను ఎగరాలి కదండీ.. నేనింకా నేలపైనే వున్నా..:-)
Deleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాళ్ండీ సృజన గారూ..