Monday, August 19, 2013

ఒక సమయం..




పక్షి రెక్కల టప టపల నుండి 
రాలిన చినుకుల రంగు 
దేహమంతా



సీతాకోక చిలుక రెక్కల నుండి
జారిపడిన పుప్పొడి 
కనురెప్పల మీద



వరి పైరు మీదుగా వీచిన
గాలి పచ్చగా 
పరిసరమంతా



తడిచిన మట్టి పరిమళం
కోనేటి మీదుగా 
అలలు అలలుగా



రంకె వేస్తున్న కోడెద్దు కాలి
గిట్టల నుండి ఎగిరిన
ధూళి ఎర్రగా



సుదూరంగా వెదురు వనాల 
నుండి గాయపడ్డ 
రాగమేదో కోస్తూ



పడమటి కొండ గొంతులో
భారంగా సూరీడు
ఆత్మహత్య



ముఖం చూపలేని వెన్నెల 
దు:ఖాన్ని దోసిలిలో 
ఒంపుతూ

16 comments:

  1. అద్భుతం....మీ శైలి...భావం...

    ReplyDelete
  2. భావం ప్రకృతి తో పోటీ పడుతుంది, ముభావం గానే చాలా చెపుతుంది. మీదైన శైలిలో చాలా బాగుంది.

    ReplyDelete
  3. Replies
    1. ధన్యవాదాలు శ్రీదేవి గారు..

      Delete
  4. అంత అందమైన వర్ణనలో ఆ చివర్న విషాదఛాయలెందుకో...వర్మగారికి విషాదం అత్యంత ప్రియం కాబోలు.:)

    ReplyDelete
    Replies
    1. విషాద యోగం అనికేత్... :-) థాంక్స్ ఫర్ యువర్ కైండ్ కాంప్లిమెంట్..

      Delete
  5. అందమైన కవితా హరివిల్లులా ఉందండి. చాలా బాగుంది!

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..

      Delete
  6. మీ కవితను చదవటం యిదే ప్రధమం . సింపుల్ & బ్యూటిఫుల్ .

    ReplyDelete
  7. చిన్ని చిన్ని పదాలతో చక్కగా అలరించారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు తెలుగమ్మాయి గారు

      Delete
  8. ఫోటో చూసి ఏదో పక్షులపై పడ్డారు కామోసు అనుకున్నా....ప్రకృతి అందాల్లో మీ వేదన మీదైన పద్దతిలో పండిచారుగా ;-)

    ReplyDelete
    Replies
    1. పక్షులపై పడాలంటే నేను ఎగరాలి కదండీ.. నేనింకా నేలపైనే వున్నా..:-)
      మీ అభిమాన స్పందనకు ధన్యవాదాళ్ండీ సృజన గారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...