కవిత్వంతో నా పయనం...
కవిత్వంతో నా పయనం:
కవిత్వం నన్ను నేను సంభాళించుకొని సంగ్రహించుకొని కొనసాగడానికి ఉపకరణమవుతోంది.
కాస్తా నిశ్శబ్ధాన్ని ఏరుకొని పొదువుకొని పొదగడానికి వీలు కల్పిస్తుంది.
చుట్టూ వున్న వాతావరణంలోని జీవావరణంలోని రణగొణధ్వని కృత్రిమత్వం అమానవీయత
అసహజత్వంలనుండి దూరం కావడానికి నా రాతల ద్వారా మిత్రులతో సంభాషించడానికి
ఇదొక సాధనంగా మాత్రమే నేను చేస్తున్నా.
పశుల కాపరిగా వున్న ఒంటరి పిల్లాడు తన ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు చేతిలోని వెదురు కర్రను ఊదుతూ తనను తాను మరచినట్టుగా.
మీ పయనం కేవలం మీ సంతృప్తి కోసమే అంటే నిజం కాదు. ఎన్నో సామాజిక సమస్యలకు మీ కలాన్ని కదిలించిన ధీరులు మీరు. మీ పయనం నలుగురికీ వెన్నెల (ఉజ్వల ) దారికావాలి ఆశిస్తూ...మీ అభిమాని
ReplyDeletethanks a lot Fathimaji
ReplyDeleteకవిత్వం నన్ను నేను సంభాళించుకొని సంగ్రహించుకొని కొనసాగడానికి ఉపకరణమవుతోంది. కొనసాగిపోతూ వెదురు వేణువులో సప్తస్వరాలని పలికించండి.
ReplyDeleteమీరిలా ప్రేరణనిస్తుంటే అలాగేనండి.. థాంక్యు వెరి మచ్..
Deleteమన్నించాలి వర్మగారు....ఒంటరితనాన్ని జయించాలి అని మీరు రణగొణధ్వని నుండి ఎంతకాలమని పారిపోయి వెదురుకర్రతో ఊదుకుంటూ కూర్చుంటారు చెప్పండి. ఇది కేవలం కొంతకాలం వినడానికి బాగుంటుందేమో కాని మరీ అదే మూసలో అలాగే ఒంటరిగా ఉంటాను అంటే ఇంక జీవితానికి అర్థమేం ఉంటుందని? ఇది మీరు రాసిన పోస్ట్ చదివినప్పటి నుండి దొలిచేస్తున్న ప్రశ్న. నా దృష్టిలో మనం ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా నలుగురితో నవ్వుతూ నవ్విస్తూ బ్రతికేయాలని. చేయగలినంత మేర సహాయం చేయాలి, లేదంటే హానిమాత్రం చేయకూడదు అనుకుంటాను. ఇది కేవలం నా భావమే మీతో పంచుకున్నాను ఇలా మీ బ్లాగ్ లో.
ReplyDeleteహాని చేయడం ఎన్నటికీ నా స్పృహలో లేదు. సమూహంలో ఒంటరితనం ఒంటరితనంలో సమూహతత్వం నాకలవడినది. అది సులక్షణమో దుర్లక్షణమో కొనసాగుతూనే వుంది. నా కవిత్వ పయనం ఇలా.. సాయం చేసేంత ధాతృత్వానికి నేను ఎదగలేదు. కానీ అపకారం చేయకపోవడమూ ఉపకారమే అన్న భావం కలవాడిని. నవ్వుతూ నవ్విస్తూ తుళ్ళింతలాడే గుణం కూడా అబ్బలేదు. ప్చ్.. ఈ జీవిని భరించాల్సిందే ఈ నేలతోపాటు సహచరులు కూడా.. ఆ నిండు మనసు మీకుందన్న నమ్మకముంది. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..
Deleteఈ ప్రపంచం లో ప్రతీ జీవీ...ఒంటరే..కాకపొతే....చాలా కొద్ది మందికి మటుకే....తమ ఒంటరితనాన్ని దూరం చెసే ఆత్మ బంధం ఒకరితో ఏర్పడిపోతుంది...ఆనందానిస్తుంది...లేని వారు ఒంటరితనంలోనే.....ఎంతమందిచుట్టూ ఉన్నా ఒక్కోసారి మన ఒంటరితనమే మన నేస్తం అనిపిస్తుంది.....ప్రశాంతతనిస్తుంది
ReplyDeleteనిజమే అనూ గారు. ఒంటరితనాన్ని దూరం చేసే బంధాలు అనుబంధాలు వున్నాయా నిజంగా? వాటి పట్ల వ్యతిరేకత లేదు కానీ నమ్మకమే లేదు. పుట్టినప్పుడు పోయేటప్పుడు ఒంటరే కదా జీవి. ఆ చీకట్లో కాసింత ప్రశాంతతని కోరుకుంటుంది మనసెప్పుడూ.
Deleteమీ అభిమానాత్మీయ స్పందనకు ధన్యవాదాలు..