Sunday, September 22, 2013

రావా....


దూరాన్ని టుప్ టుప్ మని దారప్పోగులా తెంపి
నువ్వొక్కసారి కనులముందు నిలవగానే
మా ఇంటి ముంగిటి గులాబీ నవ్వుతూ ఎరుపెక్కింది...
 
 తడిచిన ఆకుల చివుళ్ళనుండి నీపై కురిసిన 
చినుకుల తుంపరతో నువ్వొక్కసారి నవ్వుల వానవయ్యావు...

కాసిన్ని జాజులు కొన్ని మల్లెలు కలగలిసిన 
గమ్మత్తు నైట్ క్వీన్ సువాసనేదో కమ్ముకుంది  పరిసరమంతా...

వాన వెలిసాక ఇంద్రధనస్సులా ఒక్కసారిగా
వర్ణాలన్నీ ఏకమై నేతంచు జరీలా  చుట్టూ విరబూసాయి...

రావా నేస్తం!
మరలా ఒక్కసారి ఈ ఆత్మను కోల్పోయిన దేహంలోకి
కాంతిపుంజంలా మరో జన్మ ప్రసాదిస్తూ...

5 comments:

  1. చాల బావుంది వర్మగారు. మీకవిత మళ్ళి మళ్ళి చదవాలనిపిస్తుంది


    'రావా నేస్తం!
    మరలా ఒక్కసారి ఈ ఆత్మను కోల్పోయిన దేహంలోకి
    కాంతిపుంజంలా మరో జన్మ ప్రసాదిస్తూ.'.

    మణి వడ్లమాని

    ReplyDelete
  2. Ur feelings r amazing!
    I felt da FEEL!!

    ReplyDelete
  3. Sorry sir...just now I chkd...thinking that I have posted twice ...I deleted my cmnt before.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...