Monday, November 18, 2013

అనామధేయం..

నీ చేతిలో ఓ శిరస్సు మొలకలేస్తోంది
దాని పెదవులపై కత్తిరించబడ్డ చిర్నవ్వు
కనులలో ఒలికి గడ్డకట్టిన నీటి చారిక
గాయపడ్డ గొంతులోంచి పాట నెత్తుటి జీరలా
ఈ నదీ పాయ గుండా ప్రవహిస్తూ
నీలోంచి నవ నాడుల దారులలో
ఉబికి వస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ
నువ్విదిల్చినా వదలని ఆ
అముఖం నీలోకి ఇంకుతూ ఇగురుతూ
నిన్ను అనామధేయుణ్ణి చేస్తూ
తొలి దారుల ఆదిమ పూల
బాలింతరపు వాసనతో
నీ చుట్టూ పరివ్యాప్తమవుతూ
కార్యోన్ముఖుణ్ణి చేస్తూ...

6 comments:

  1. వర్మగారు.....ఈ శీతాకాలంలో కూడా చల్లారకుండా ఎగసిపడే జ్వాలలెందుకు? కాస్త కూల్ కూల్ గా ఏమైనా రాయండి :-)

    ReplyDelete
    Replies
    1. కూల్ కూల్ గా వుందనే ఇలా వేడి పోస్ట్.. థాంక్యూ పద్మార్పిత గారూ..

      Delete
  2. నీలోంచి నవ నాడుల దారులలో
    ఉబికి వస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ...different sir

    ReplyDelete
  3. మీరిలా మార్కులు వేస్తూండండి అనికేత్.. థాంక్యూ..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...