ఒక్కోసారి
సాదాగా పారే నదీపాయలా
ఒక్కోసారి
ఉధృతమైన జలపాతంలా
ఒక్కోసారి
హాయిగా తాకే సమీరంలా
ఒక్కోసారి
పెకలించే విసురుతనంతో
ఒక్కోసారి
వెచ్చగా కరచాలనంలా
ఒక్కోసారి
భగ భగమండే పర్వతంలా
ఒక్కోసారి
సుతారంగా తాకే పూరేకులా
ఒక్కోసారి
కస్సున దిగబడే ముళ్ళులా
ఒక్కోసారి
కాగితం పడవలా తేలియాడు
ఒక్కోసారి
రివ్వున దూసుకుపోయే తారాజువ్వలా
ఒక్కోసారి
పైకెగిరే గాలిపటంలా
ఒక్కోసారి
నిప్పులు విరజిమ్మే రాకెట్ లా
కానీ
ఎల్లప్పుడూ
మనిషితనంతో పయనించు..
ఇలా ఎడారిపయనం కష్టం కదండి
ReplyDeleteఏది ఏమైనా పయనించక తప్పదు అంటారా వర్మగారు ;-)
ReplyDeleteMANASUPAI NIYATHRANA UMTE YE DAARINAINAA
ReplyDeleteOKELAA SWEEKARIMCHAGALAM .
NICE JOURNEY....
పయనం ఎటువైపుకో :-)
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు..
ReplyDelete