అక్షర వృత్తాలు
తలతిప్పగ చుట్టూ చీకటి అరల మద్య
నువ్వో సుక్కలా మెరిసేవు
ఎక్కడో దాగున్న ఆ జ్నాపకాల నీటి పొరలను
చీల్చుకు వచ్చేవు
ఎన్నెల ఎలుగులు ఎక్కడో మాసి పోయినట్టు
ఈ మూల ఒట్టిపోయిన నీటి కుండ
దాహమేయని గొంతులో నువ్వొక చినుకులా
పుష్పిస్తావు ఈ కటకటాల వెనక
మసిరాతల గోడల నిండా అతకని
అక్షరాల వృత్తాల మద్య
బంధించబడ్డ హృదయం నెత్తుటి జాడల గుండా
ప్రవహిస్తున్న జీవ కళిక
ఎక్కడో నూనె మాసిన మల్లెల వాసన
ముక్కుపుటాలను తాకుతూ
మరపు రాని మాటల ముసురులా
ఈ చలి నెగడు చుట్టూ
పాకురు పట్టిన గోడ మీదుగా పాకిన
సన్నని పూల తీగ పసుప్పచ్చగా
నిద్ర మరచిన ఒంటరి కనురెప్పల మద్య
కరిగిపోని కల ఓ రక్త చారికలా!!
(12-11-13 2.49 PM)
ఒంటరి ఖైదీ మదిలో మెరిసే జ్ఞాపకాలే కదా.....కాలంతోబాటు సాగడానికి....జీవించడానికి ఆసరా...
ReplyDeleteదాహమేయని గొంతులో నువ్వొక చినుకులా
పుష్పిస్తావు ఈ కటకటాల వెనక
ఎంతో అపురూపంగా అనిపిస్తోందీ భావన...."కవి వర్మ" గారూ
Thank you Anoo gaaru..
DeleteGurujee....heart touching..:-):-)
ReplyDeleteThank you Karthikji..
Deleteదాహమేయని గొంతులో నువ్వొక చినుకులా
ReplyDeleteపుష్పిస్తావు ఈ కటకటాల వెనక....ఎంత వేదనండి
అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుగమ్మాయి గారు
Deleteమీ ఈ ప్రతి పదంలోను మీరున్నారు
ReplyDeleteభావాలు మీవి, పదాలు మీవి....
వ్యధ మాత్రం మీది కాకూడదని ఆశిస్తూ
మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు..
Deleteఎక్కడో నూనె మాసిన మల్లెల వాసన
ReplyDeleteముక్కుపుటాలను తాకుతూ
ఇలా రాయడం మీకే సొంతం
ధన్యవాదాలు యోహాంత్ గారు..
Deleteప్రతి అక్షరమూ ఓ గొప్ప భావాన్ని మోసుకొస్తుంది.
ReplyDeleteమీదైన శైలిలో చాలా బాగుంది వర్మాజి
Thank you Fathimaji..
Delete