Monday, July 16, 2012

విరామం..



ఇలా ఒక్కోటీ గురి చూస్తూ
వస్తూ పోతూన్న
రంగు రంగుల రెక్కల
పిట్టల గుండె సవ్వడిని వింటూ...

నారి బిగించని విల్లుతో
అలసటగా యిలా ఈ దోసెడు
చలమ నీటిని గొంతులో
ఒంపుకుంటూ...

గురి తప్పని నా అమ్ము
ఏ గుండెని చీల్చకూడదని
ఈ విరామాన్ని పాటిస్తూ...

సేద దీరనీ
ఈ వేళ...

10 comments:

  1. చక్కగా రాశారండి, మంచి ఫీలింగ్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్జీ...

      Delete
  2. చాలా బాగుంది వర్మ గారు..

    ReplyDelete
  3. వర్మాజీ, రాతి గుండెలను కరిగిస్తూ రాసిన శాసనాలు, ఎందమావులైన ఆశల తోరణాలు కలిగిన చరిత్ర మనది. మనకళ్ళలో మెరిసి ,మస్తిష్కంలో మెదిలిన ఎన్నో జ్ఞాపకాలు ఇలాంటి శిలలు. కవిత ఇవన్నిటినీ గుర్తు చేసింది. బాగుంది. ( sir mee new kavitha ki pettina comment idi, mee blog latest post ki accept cheyyatam ledu.)

    ReplyDelete
    Replies
    1. బ్లాగులో సమస్యేమిటో తెలీడం లేదు..నాకైతే బాగానే వుంది. మీ వివరణాత్మక స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...