Saturday, June 2, 2012

తలుపు ఆవల..



ఎవరో తలుపు తీసిన అలికిడి!

ఒక్కసారిగా..
గదినిండా పరచుకున్న వెలుగు

కళ్ళు నులిమి చూస్తే కాని
చూడలేక పోయినంత...

ఉదయమే యింత
కాంతిని నింపిన దయాళువెవరో??

సవ్వడిలేని అడుగులతో
గుండె గదినిండా అలజడి..

నిర్వికల్ప సమాధి నుండి
చేయి పట్టుకు లేపిన దెవ్వరో??

తలుపుల కిర్రు సవ్వడింకా
చెవులలో...

కాంతిపుంజపు వెలుగు
కనులలో...

పసుపు ఆకు పరిమళం
దేహమంతా....

ద్వారం బయట
తను...

నిశ్శబ్ధంగా
అలల
కల్లోలంలో
నాలో
నేను....

14 comments:

  1. నిర్వికల్ప సమాధి నుండి
    చేయి పట్టుకు లేపిన దెవ్వరో??
    chaalaa bhgundandi.

    ReplyDelete
  2. ఎవరో??? అంటూ ఇంతందంగా అడిగినా చెప్పినా మీకే చెల్లు!:-)

    ReplyDelete
    Replies
    1. మీరూ అలా అనేస్తే ఎలా పద్మాజీ..:-)

      Delete
  3. Dear Varma garu,
    Me blogulu choostune unnanu F.B.lo.Chaalaaaa baguntayi Keep it up.

    ReplyDelete
  4. ఎప్పటిలాగే బాగుంది

    ReplyDelete
  5. వర్మాజీ , నిగూడమైన భావన అందంగా తెలుపుటలో మీకు మీరే సాటి , వెలుతురూ ,వెన్నెలా ,వేడిమీ ,చీకటీ వీటి వివరణా ,వర్ణనా మీ కలంలోనే సాద్యం , ఎప్పటిలాగే కవిత చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. మీ సృజనాత్మక విశ్లేషణతో నా రాతలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు ఫాతిమాజీ...

      Delete
  6. Replies
    1. @చెప్పాలంటే..ధన్యవాదాలు సార్...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...