విధిని నిందించడమేనా...
ఏమో ఈమె నుదుట సూరీడు
అస్తమించాడో
తనకు తాను
ఆత్మహత్య చేసుకున్నాడో??
కానీ ఓ నిండు జీవితాన్ని
కన్నీటి మబ్బుల మాటుకు
తోసేసి వాడు హాయిగా
పడమటింట నిదురోతుంటే..
ఏమీ చేయలేని నిస్సహాయత
గుండె కవాటాలని మూసేసింది
ఒక్కసారిగా...
ఇంత నిర్దయగా
వుండే సత్యమా
నీ నిజస్వరూపమిదేనా??
మళ్ళీ ఆమె కంట్లో
వెన్నెల నవ్వు
పూయించాలని
ఆర్తిగా ఎదురు చూపు!!!
(తిరుమలకు..)
మరల వెన్నెల విరబూయాలని మనస్ఫూర్తిగా కోరుతూ...
ReplyDeleteThanks for your kind concern Padmarpita gaaru..
Deleteవర్మాజీ , కవిత ఆలోచిప చేస్తుంది, ఆర్ద్రత ఉంది, ఆవేదన , ఉంది నిజానికి మీ కవితలు నేను చాలా సార్లు వార పత్రికలలో చూసాను. నేను మీ అభిమానిని , ఇప్పటి మీ కవిత కదిలించింది .
ReplyDeleteమీ ఆత్మీయ ప్సందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ...
Deleteఅయ్యో:(
ReplyDeleteThanks for sharing సృజనగారు..
Delete:(
ReplyDeletecheekati venta veluturu epudoo untundi kadaa...
ReplyDeletealanti jeevitaalalo marala sooryuduyaistaadu...aalasyamgaanainaa sare..
@sri
అలా ఉదయించాలని ఆశిద్దాం శ్రీ గారు...ధన్యవాదాలు..
Delete