నీ కంటి చివర
విసిరిన
ఆ నిరాకారాపు చూపు
నా నిలువెల్లా మంటల్లో
దహించి వేస్తుంది...
దేహమంతా సూదులతో
గుచ్చి
ఏసిడ్ పూత పూసినా యింత
గాయమయ్యేది కాదు..
నిలువెల్లా ఎడారి ఇసుకలో
పాతుకు పోయినా
ఇంత దాహమయ్యేది కాదు...
అంతలోనే
నీ పెదవి చివర
తళుక్కుమన్న చిర్నవ్వు
గుండెల్లో వెన్నెలని
పూయిస్తుంది....
విసిరిన
ఆ నిరాకారాపు చూపు
నా నిలువెల్లా మంటల్లో
దహించి వేస్తుంది...
దేహమంతా సూదులతో
గుచ్చి
ఏసిడ్ పూత పూసినా యింత
గాయమయ్యేది కాదు..
నిలువెల్లా ఎడారి ఇసుకలో
పాతుకు పోయినా
ఇంత దాహమయ్యేది కాదు...
అంతలోనే
నీ పెదవి చివర
తళుక్కుమన్న చిర్నవ్వు
గుండెల్లో వెన్నెలని
పూయిస్తుంది....
చాలా బాగుంది..
ReplyDeleteచదువుతుంటే కాస్త బాధగా కూడా ఉంది అండి..
థాంక్యూ సాయి గారు..
Deleteచిరునవ్వు నవ్వితే హృదయస్పందన
ReplyDeleteనిరాకారాపు చూపు విసిరితే మూగవేదన.....
Nice One!
థాంక్యూ జలతారువెన్నెలగారూ..
Deleteఒక్క చిరునవ్వు ప్రేమ దాహాన్ని తీరుస్తుంది చాల బాగా రాసారు . వర్మాజీ మీరు ఎంచుకున్న బ్లాగ్స్ లో కవితాసుమహారం లేక పోవటం కొంచం నిరాశానిచ్చింది
ReplyDeleteథాంక్సండీ ఫాతిమాజీ..సారీ... మీ బ్లాగు ఫాలో అవుతున్నానెప్పుడూ...లింక్ చేర్చడం ఆలస్యమైనందుకు మన్నించండి..
DeleteVery nice..Varma gaaru. sply నిలువెల్లా ఎడారి ఇసుకలో
ReplyDeleteపాతుకు పోయినా
ఇంత దాహమయ్యేది కాదు...
chaalaa baagundi.
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వనజగారు..
Delete