Sunday, May 27, 2012

వేసవితనం...



నీ కంటి చివర
విసిరిన
నిరాకారాపు చూపు
నా నిలువెల్లా మంటల్లో
దహించి వేస్తుంది...

దేహమంతా సూదులతో
గుచ్చి
ఏసిడ్ పూత పూసినా యింత
గాయమయ్యేది కాదు..

నిలువెల్లా ఎడారి ఇసుకలో
పాతుకు పోయినా
ఇంత దాహమయ్యేది కాదు...

అంతలోనే
నీ పెదవి చివర
తళుక్కుమన్న చిర్నవ్వు
గుండెల్లో వెన్నెలని
పూయిస్తుంది....

8 comments:

  1. చాలా బాగుంది..
    చదువుతుంటే కాస్త బాధగా కూడా ఉంది అండి..

    ReplyDelete
  2. చిరునవ్వు నవ్వితే హృదయస్పందన
    నిరాకారాపు చూపు విసిరితే మూగవేదన.....

    Nice One!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ జలతారువెన్నెలగారూ..

      Delete
  3. ఒక్క చిరునవ్వు ప్రేమ దాహాన్ని తీరుస్తుంది చాల బాగా రాసారు . వర్మాజీ మీరు ఎంచుకున్న బ్లాగ్స్ లో కవితాసుమహారం లేక పోవటం కొంచం నిరాశానిచ్చింది

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ ఫాతిమాజీ..సారీ... మీ బ్లాగు ఫాలో అవుతున్నానెప్పుడూ...లింక్ చేర్చడం ఆలస్యమైనందుకు మన్నించండి..

      Delete
  4. Very nice..Varma gaaru. sply నిలువెల్లా ఎడారి ఇసుకలో
    పాతుకు పోయినా
    ఇంత దాహమయ్యేది కాదు...
    chaalaa baagundi.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వనజగారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...