Wednesday, May 9, 2012

దిగంతాలకావల...



దిగంతాల చివరాఖరు అంచుపై
నువ్వూ నేనూ..

ఏ మాలిన్యమూ అంటని
ఏ కాలుష్యమూ సోకని
ఏ కాఠిన్యమూ తాకని
నవ్వుల కాంతులు పూయిస్తూ..

దేహమంతా సంతోషపు
రెక్కల సవ్వడి వీవెనగా...

మనకు మనమే
రారాజుగా
ఈ ఆకాశపుటెడారిలో
ఆర్థ్ర వర్షపు జల్లులలో
తడుస్తూ
దాహార్తిని తీర్చుకుంటూ....

ఎలుగెత్తి స్వేచ్చా నినాదం
ఆద్యంతాలు పిక్కటిల్లేలా
చేస్తూ...

ఒక్కో అణువూ
దేనికదే విడివడి
దానికదే ఏకమవుతూ
సాగుతున్న
ఈ అనంత పయనంలో
సమూహంలో
ఒంటరి బాటసారిగా....

4 comments:

  1. చాలా బాగుంది వర్మ గారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జలతారువెన్నెలగారూ..

      Delete
  2. sir, me kalaaniki venna raasi vennelalo thdipi makarndam raasi manchulo munchi raasaremo ee kavithani anipistundi . chala chala bagundi. me kavithalu nenu aadivaram andhra jyothi lo chusanu chala sarlu,

    ReplyDelete
    Replies
    1. Meraj Fathimaగారూ మీ కవితాత్మీయ వ్యాఖ్యానంతో చాలా సంతోషమేసింది.. ధన్యవాదాలు....

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...