
వెతికే నా కంటి చూపు లోతు తెలియనిదా
నీ కనురెప్పల కావల దాగిన
నా మనోచిత్రానికి...
నీ ప్రేమ కోసం ఆర్తిగా వేచివున్నానని
ఆ తపనలో దాగిన నా ఎద లయ
విన్న నీకు తెలియనిదా...
నా మాటలన్నీ నీ మౌనాన్ని
బద్ధలు చేసి నీ గుండె తలుపును
తట్టి నీ దరికి చేరడానికే కదా...
నీవు పలుకని ప్రతి క్షణం
నా దేహమంతా చీకట్లు ముసురుకున్నట్టు
అమవాస వెలితిలో భారంగా
రథచక్రం కుంగిన కర్ణునిలా
కూలబడ్డ నా వంక చూసి
చులకనైనది ఎవరో తెలియదా,,,
సఖీ ప్రియా
కలసిన మనసుల మధ్య
మౌనరాగాల నేపథ్య సంగీతంలో
ఇన్నిన్ని ప్రశ్నల బాణాలతో
గుండెను గాయం చేయాలా??
నా కన్నీటి దోసిలిలో
ఓ వెండి వెన్నెల పూర్ణిమలా
నవ్వుతూ కానరావా...
Thank u జలతారువెన్నెలగారూ..
ReplyDeletechala hrudyanga undi varma ji...chikkati arthrata....malli malli chadivinchindi...
ReplyDeleteThank you Madam...
Deleteఇంత అందమైన చిత్రాలతో, మనసుకు హత్తుకునే భావాలతో అభ్యర్ధిస్తే ఎంతటి కఠినాత్ములైనా మారతారుకదండీ:-)
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పితగారూ...మీ మెచ్చుకోలు పొందడం హేపీ...:-)
DeleteGOOD POETRY.
ReplyDeleteThank you D.RAMACHANDRA RAJU Gaaru...
Delete