
ఒక్కోసారి అంతే..
తను పెరిగి పెద్దవాడైనా
తన వెనకే నడవాలని
తన నీడనే వుండాలని
కోరుకుంటుంది మనసు...
కానీ
నా లాంటి
అమ్మలనెందరికో
పుత్ర వాత్సల్యాన్ని తీర్చే
కొడుకుగా నడుస్తూ
వెళతావని ఊహించలేదు...
నాకు నీ రాజకీయ ప్రకటన
అర్థం కాలే..
కానీ అర్థాకలితో నిదరోయే
ఎన్నో కాలిన పేగుల వాసన
దానిలో కనబడి
నిన్ను తలచిన ప్రతిసారీ
నా పేగు కదిలింది...
ముంగిట వున్న
మామిడి చిగురువేసి
పూత వచ్చి పిందెలన్నీ
పండ్లుగా మారిన ప్రతిసారీ
గుర్తుకొస్తూనే వుంటావురా...
పొలం గట్లపై
లేడి పిల్లలా దుంకుతూ
తల్లి ఆవు వెనక
పరుగుపెట్టే లేగ దూడ
లేత గిట్టల్ని చూసినప్పుడంతా
యాదికొస్తావురా...
తొలకరి చినుకు పడి
మట్టి పురిటి వాసన
వేసిన ప్రతిసారీ
నీ తొలి పిలుపు
మెదిలి కన్న
పేగు మెలిపెడ్తుందిరా..
నీవు చెప్పే మాటలన్నీ
పాడే పాటలన్నీ
వినబడీ చనుబాలధార
కడుతుంటే
కన్నీళ్ళింకినది గుండెల్లోకాదని
తెరిపినిస్తుంది...
ఒక్కొక్కరు ఒక్కో మాటాడుతూ
తూట్లు పొడవాలని చూస్తుంటే
నీ గుండెనిబ్బరం చూసి
అమ్మనైనందుకు
గర్వంగా వుంటుంది...
నీవలాగే
నిరంతరమూ ఎక్కుపెట్టిన
విల్లులా నిలిచి
పోరుసల్పాలని
ఆశపడుతూ
పొడుస్తున్న
పొద్దులో వెతుకుతు...
నిరంతరమూ ఎక్కుపెట్టిన
ReplyDeleteవిల్లులా నిలిచి
పోరుసల్పాలని
ఆశపడుతూ
yours friendly
thank you Bhskargaaru..
Deleteఅందరూ అమ్మ గురించి రాస్తే..
ReplyDeleteబిడ్డ గురించి అమ్మ రాస్తే?????
ఇంతందంగా ఉంటుందన్నమాట!!
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు**
ఇంత ఆత్మీయతతో ఆర్థ్రతతో అర్థం చేసుకొని స్పందించిన మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో పాటు ధన్యవాదాలు పద్మార్పితగారూ...
Deleteఅమ్మ మనసు మాట కదిలించింది. బిడ్డ ఉనికిని చైతన్యంలో చూసుకునే తల్లి మనసు కి వందనాలు.
ReplyDeleteచాలా బావుంది.
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు వనజవనమాలిగారు..
Deleteఅమ్మ మనసుని కళ్ళకు కట్టినట్టుగా చూపించిది మీ కవిత. అభినందనలు మీకు.
ReplyDeleteజలతారు వెన్నెలగారూ ధన్యవాదాలండీ..
DeleteSir అమ్మ చేసుకున్న బొమ్మ మీద అమ్మే చెప్పటం ఎంత కమ్మగా ఉందో. మీ కవితలన్నీ విలక్షణంగా ఉంటాయి
ReplyDeleteమీరజ్ ఫాతిమ గారూ మీ స్పందన స్ఫూర్తినిచ్చింది...ధన్యవాదాలు...
Deletevery nice varma gaaroo!
ReplyDelete@sri
Thank you శ్రీ గారూ..
Deleteఅమ్మ తన బిడ్డ గురించి రాస్తే ఇంత బాగుంటూందా..!!
ReplyDeleteకదిలించింది అండీ....... చాలా బాగుంది
థాంక్సండీ సీతగారూ నచ్చినందుకు..
Delete