నాతో ఆమెతో నేను
నాతో ఆమె
ఎందరిలో వున్నా....
నీ సవ్వడే వినిపిస్తుంది!
పనిలో నిమగ్నమైన ....
నీతో మాట్లాడాలనిపిస్తుంది!
ఓపిక లేకున్నా ....
నిన్ను కలవాలనిపిస్తుంది!
ఇంతవరకు నిన్ను చూడకున్నా....
నీకు సన్నిహితంగా మెలగాలనిపిస్తుంది!
అర్థం లేని ప్రశ్నలే అని నీవన్నా....
ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబులు నీవేగా తోస్తుంది!
అలసిన వేళ నిద్రపుచ్చాలని....
నిదురోతుంటే తట్టిలేపాలనిపిస్తుంది!
నీతోనే ఇలా సాగిపోవడం తప్పని తెలిసినా....
మనసు ఇలా నన్ను వెంటాడి వేధిస్తూనే ఉంది!
నీవు నాదరి లేకున్నా, నాలోనే ఉన్నట్లు....
ఏదో తెలియని అనుభూతి నన్ను గిలిగింతపెడుతుంది!
ఆమెతో నేను...
మౌనంగా నీ అంతంరంగ చిత్రాన్ని
నలుపు తెలుపుల సమ్మేళణం చేస్తూ
ఇలా నీ ఎదురుగా నిర్నిమేషంగా...
ఇంత హడావిడి జీవన పరుగులోనూ
ఒకింత సేదదీరి ఊపిరి పీల్చుకోవాలనిపించేది
నీ చెంతనే కదా...
ఏదో బతుకు ఓ బండరాయిలా
దొర్లుకుంటూ మీద ఒరిగిపడుతున్న వేళ
నీ నీడ చాటున దాగి రహస్యంగా
ఓ గుక్కెడు నీళ్ళు తాగాలనిపిస్తోంది...
ఇది తప్పు ఇది ఒప్పు అని
కానరాని లక్ష్మణ రేఖ ఏదో
మన మధ్యన భగ్గుమని లేస్తూ ....
నిన్నో ఒడ్డుకు నన్నో తీరానికి
విసిరేయ జూస్తున్నా...
అందని చేతి వేళ్ళను
తాకాలని మదినిండా
తీరని అభిలాష వెంటాడగా...
స్మృతులన్నీ ఏక్ తారగా
ఆలపిస్తున్న యీ నా మౌన గీతం
నీకే అంకితం...
wah ji ....no words " aame evaru?" haha telipoindile.....prematho....nee j
ReplyDeleteఎవరామె?? ధన్యవాదాలు జె..
DeleteNow I can see the picture! Nice one!
ReplyDeleteThank You జలతరువెన్నెలగారూ..
Deleteమంచి పోటాపోటీగా సాగిపోతున్నట్లుందిగా...:-)
ReplyDeleteమేము involve కాములెండి వర్మగారు...:-)
పిక్ చాలా బాగుందండి!జుగల్బందీ too...:-)
Hi..Padmarpita గారూ..మీకు నచ్చి మెచ్చినందుకు ధన్యవాదాలు..synchronize కావచ్చు కదా..:-)
Deleteచాలా బాగారాసారండి.
ReplyDeleteప్రేరణ..గారూ ధన్యవాదాలు..
Deletewow that's the competitive spirit sir :)
ReplyDeletecarry on.She & He both rocks.
జీవన పయనం-అనికేత్ గారూ థాంక్యూ...:-)
Deletestraight from a passionate heart :-) loved it varma ji:-)
ReplyDeleteThank u Madam..
Delete