నిశ్శబ్ధం
ఒంటరిగా
కాలుతున్న వాసన...
చెవిలో ఏదో సైలెన్సర్ బిగించినట్టుగా
ఏదీ వినబడనితనం
ఒక్కోమారు బిగుతుగా...
కంట్లో రెటీనాపై నల్లగా ఓ తెర కప్పి
లోలోపల ఏవో శూన్య రేఖలు
బర బరా గీస్తున్నట్టు...
దేనికదే వేటికవే
ఓ నిశ్శబ్ధ యంత్రం చుట్టూ
మూగి గుస గుసలాడుతున్నట్టు...
దేహమంతా ఓ గుండ్రని
బంతిలా మారి దొర్లుకుంటూ
ఓ మూలన చేరినట్టు...,
గాలి వీయని తనంతో
అంతా మూగగా ఉగ్గబట్టి
రోదిస్తున్న వేసవితనం ముసురుపట్టినట్టు...
సెలయేళ్ళన్నీ బయలు దేరిన చోటనే
లోలోపలికి యింకుతూ
రాతి మూలల దాగినట్టు...
అలలన్నీ బంద్ చేసి
ఒడ్డుకందని దూరంతో
సముద్ర గర్భంలో నిదుర పోయినట్టు...
ఆకురాలిన కాలంలో
గొంతు మూగబోయిన
కోయిలలా పాటరానితనంతో
నేనిలా...
ఒంటరిగా
కాలుతున్న వాసన...
చెవిలో ఏదో సైలెన్సర్ బిగించినట్టుగా
ఏదీ వినబడనితనం
ఒక్కోమారు బిగుతుగా...
కంట్లో రెటీనాపై నల్లగా ఓ తెర కప్పి
లోలోపల ఏవో శూన్య రేఖలు
బర బరా గీస్తున్నట్టు...
దేనికదే వేటికవే
ఓ నిశ్శబ్ధ యంత్రం చుట్టూ
మూగి గుస గుసలాడుతున్నట్టు...
దేహమంతా ఓ గుండ్రని
బంతిలా మారి దొర్లుకుంటూ
ఓ మూలన చేరినట్టు...,
గాలి వీయని తనంతో
అంతా మూగగా ఉగ్గబట్టి
రోదిస్తున్న వేసవితనం ముసురుపట్టినట్టు...
సెలయేళ్ళన్నీ బయలు దేరిన చోటనే
లోలోపలికి యింకుతూ
రాతి మూలల దాగినట్టు...
అలలన్నీ బంద్ చేసి
ఒడ్డుకందని దూరంతో
సముద్ర గర్భంలో నిదుర పోయినట్టు...
ఆకురాలిన కాలంలో
గొంతు మూగబోయిన
కోయిలలా పాటరానితనంతో
నేనిలా...
chaala bhgundi,
ReplyDeleteరోదిస్తున్న వేసవితనం ముసురుపట్టినట్టు... lo 'vedisthunna' vunte
ela untindi?
thanksandi...
Deleteమనసుపడే బాధను చాలా చాలా బాగ చేప్పారు..
ReplyDeleteచాలబాగుంది..!
thank you very much సీత గారూ...
Deleteవర్మ గారూ రోదన మనిషికి ఓదార్పును ఇస్తుంది ,కాని వేదన క్రుంగ దీస్తుంది , వేదన కు రోదనకు మద్య ఉన్న ఓ విదమైన స్థితి మీ కవితలో కనిపిస్తుంది అదేమిటో కవిగారు బాగా వర్ణించారు , ఆ స్థితి కి ఉన్న పేరు మీరు చెప్పగలరు .కవిత అధ్బుతంగా ఉంది
Deleteధన్యవాదాలు మీరజ్ ఫాతిమాగారూ...
Deletechala bagundi andi
ReplyDeleteధన్యవాదాలండీ శేషు(నేను మీ నేస్తాన్ని) గారు...
Delete