Friday, May 18, 2012

నేనిలా...


నిశ్శబ్ధం
ఒంటరిగా
కాలుతున్న వాసన...

చెవిలో ఏదో సైలెన్సర్ బిగించినట్టుగా
ఏదీ వినబడనితనం
ఒక్కోమారు బిగుతుగా...

కంట్లో రెటీనాపై నల్లగా ఓ తెర కప్పి
లోలోపల ఏవో శూన్య రేఖలు
బర బరా గీస్తున్నట్టు...

దేనికదే వేటికవే
ఓ నిశ్శబ్ధ యంత్రం చుట్టూ
మూగి గుస గుసలాడుతున్నట్టు...

దేహమంతా ఓ గుండ్రని
బంతిలా మారి దొర్లుకుంటూ
ఓ మూలన చేరినట్టు...,

గాలి వీయని తనంతో
అంతా మూగగా ఉగ్గబట్టి
రోదిస్తున్న వేసవితనం ముసురుపట్టినట్టు...

సెలయేళ్ళన్నీ బయలు దేరిన చోటనే
లోలోపలికి యింకుతూ
రాతి మూలల దాగినట్టు...

అలలన్నీ బంద్ చేసి
ఒడ్డుకందని దూరంతో
సముద్ర గర్భంలో నిదుర పోయినట్టు...

ఆకురాలిన కాలంలో
గొంతు మూగబోయిన
కోయిలలా పాటరానితనంతో
నేనిలా...




8 comments:

  1. chaala bhgundi,
    రోదిస్తున్న వేసవితనం ముసురుపట్టినట్టు... lo 'vedisthunna' vunte
    ela untindi?

    ReplyDelete
  2. మనసుపడే బాధను చాలా చాలా బాగ చేప్పారు..
    చాలబాగుంది..!

    ReplyDelete
    Replies
    1. thank you very much సీత గారూ...

      Delete
    2. వర్మ గారూ రోదన మనిషికి ఓదార్పును ఇస్తుంది ,కాని వేదన క్రుంగ దీస్తుంది , వేదన కు రోదనకు మద్య ఉన్న ఓ విదమైన స్థితి మీ కవితలో కనిపిస్తుంది అదేమిటో కవిగారు బాగా వర్ణించారు , ఆ స్థితి కి ఉన్న పేరు మీరు చెప్పగలరు .కవిత అధ్బుతంగా ఉంది

      Delete
    3. ధన్యవాదాలు మీరజ్ ఫాతిమాగారూ...

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలండీ శేషు(నేను మీ నేస్తాన్ని) గారు...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...