Wednesday, April 18, 2012

విరిగిన జీవన చక్రం..


విరిగి మూలన పడ్డ
ఈ జీవన చక్రం
ఈ దేశ వెన్నెముక
విరిగిన గుర్తు...

యంత్ర భూతముల

వెంటపడి
కోల్పోయినది
ఈ కఱ, రాతి పనిముట్లేనా?

పచ్చగా పసుపు రాసి
పేడ కళ్ళపి జల్లి
బియ్యపు ముగ్గుతో
కలకలలాడిన పల్లెలు
నేడు ఉపాధి హామీ
మట్టి తట్టల మోతతో
జరుగు బాటు కాక
వలసబాట పట్టి
రంగు వెలిసిన
నలుపు తెలుపు
చిత్రమైంది...

గుండెలో నెత్తురు
గడ్డ కట్టి
నీవిచ్చే ముష్టి పించను
డబ్బులకు అఱులు చాస్తూ
రూపాయి బియ్యం
కడుపు నింపక
వెన్నునంటిన
పేగులను సాగదీస్తూ
నగరం మురికి బాటలో
కుప్పకూలుతోంది...

5 comments:

  1. వాస్తవ పరిస్థితిని మీ కవిత ప్రతిబింబించింది.పల్లెలు దయనీయ పరిస్థితుల్లో వున్నాయి.పట్టణాలు మురికి కూపాలయ్యాయి.

    ReplyDelete
  2. Its an a mirror to our present situation.
    Keep on writing sir....

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...