Thursday, April 12, 2012

ఓ ఉల్కలా..


ఇప్పుడు
నేను
నువ్వులా అనిపిస్తున్నా!

కాదు
నువ్వే నాలా
అనిపిస్తున్నావు!

శ్వాశలోనే కాదు
శబ్ధంలోను
చూపులోను
దాహంలోను
దేహంలో
ప్రతి అణువులోనూ...

ఆకాశం నుండి 
ఓ ఉల్కలా
నా ఎద నేలపై
దూసుకుపోయావు...

నేను 
మాయమవుతూ 
నువ్వు 
ఆవిష్కృతమవుతున్నావు...

చెరిగిపోతున్న 
నేను
కరిగిపోతున్న 
నీవు...

రంగులన్నీ 
ఏకమై 
ధవళవర్ణం
కనులముందు...

ఏది నిజమంటావు
ప్రియా?

ఏదీ కాదనలేని 
నిస్సహాయత?

కాదు
కలకాలం సాగే 
అనుబంధం కదా?

17 comments:

  1. ధవళం సప్త వర్ణ శోభితం
    సంగమం భావ రాగ రంజితం
    నిలిచేది కలకాలమైతే.. అది మరింత సుందరం

    ReplyDelete
    Replies
    1. Jayasree Naidu మేడం మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  2. అన్ని కాంతులు తెలుపు లో వున్నట్లు అనుబంధం అంటే అదే కదా!కవిత నడిపిన విధం బాగుంది.

    ReplyDelete
    Replies
    1. oddula ravisekhar సార్ ధన్యవాదాలు..

      Delete
  3. ఇరువురి తనువణువు ఒకటని, ఒకరిలో ఒకరున్నారని...
    వెన్నెలంత చల్లనిది, శ్వేతమంత స్వచ్ఛమైనదని...
    వారిరువురి బంధం అలా కలకాలం సాగాలని...
    Your expressions are so beautiful.

    ReplyDelete
    Replies
    1. @Padmarpita గారూ మీ కవితాత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ..:-)

      Delete
  4. mmmmmm adavitham love j

    ReplyDelete
  5. what an expression varma ji....loved it

    ReplyDelete
  6. "రంగులన్నీ
    ఏకమై
    ధవళవర్ణం
    కనులముందు..." వెన్నెలదారిలో ఈ ఉల్క చెదిరిపోలేదు మరింత ధవళవర్ణంలో దారిచూపుతూనే ఉంది....బావుందని వేరే చెప్పాలంటారా వర్మాజీ

    ReplyDelete
    Replies
    1. వాసుదేవ్ గారూ మీరు బావుందని చెప్పడమే నాకు స్ఫూర్తి...థాంక్యూ...

      Delete
  7. చాలా బాగుంది వర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. వనజవనమాలి గారూ ధన్యవాదాలండీ,,,

      Delete
  8. చాలా బాగుంది

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...