Tuesday, June 26, 2012

ఒంటరిగా......

అలా ఒంటరిగా చిగురున ఖాళీగా ఊసులూ వినబడనంత దూరంలో...

రిక్త హస్తాలతో గాలి అటూ ఇటూ గుండె ఐమూలలనుండి దూసుకుపోతూ ఒకటే గాలి ఊళ...

రంగూ రుచీ వాసనా అంటనితనమేదో కళ్ళముందు తెల్ల తెల్లగా రెప రెపలాడుతూ...

సర్రున పలుచని కత్తి ఏదో దూసుకుపోతున్నా ఏమీ కానట్టు మౌనంగా చేతులు బార్లా చాపి అలా ఒరిగి వుండి ఎన్నాళ్ళయిందో...

మనసంతా ఏదో సున్నం పూసినట్టు తెల్లగా మారిపోయి పెళుసులుగా ఊడి పడినా విరగనితనమేదో అద్దుకుని నిలబడినట్టు...

ఇలా ఈవల వచ్చి నిలబడు దేహమంతా ఏమీ పూసుకోకుండా ఎక్కుపెట్టిన బాణం దూసుకుపోయాక సర్ వెనక్కి వంగుతూ నిలబడ్డ విల్లులా ఒక్కమారు...

కాలం బిగ్ బెన్ లో కాలి కరగనీ ఒక్కో ముల్లూ పెళ్ళున విరిగి కలసిపోయి ఊడిబడ్డట్టు...

ప్రవాహాలన్నీ గడ్డ కట్టి కాలికింద చల్లగా మారి ఏవో సుదూర తీరాలకు గబగబా జారిపోతున్నట్టు...

పర్వతాలన్నీ తవ్విపోసి సొరంగ మార్గాలన్నీ తెరవబడ్డట్టు....

పెనవేసుకున్న వృక్షాలన్నీ పట పట విరిగి పోతూ వేళ్ళన్నీ పెకళించి తలకిందులుగా మారి నేల పురుడు పోసుకున్నట్టు...

ఆకాశంలో చుక్కలన్నీ ఆత్మహత్య చేసుకొని కింద నుండి పైకి వేలాడుతున్నట్టు...

అంతా అయోమయమైన వేళ ఒక్కడ్నే ఇలా గాలి ఈల వేస్తూ...

ఎదురుగా వున్న బండరాయిని ఒక్క కాలితోపుతో తోసి హాయిగా రెక్కలు మొలిచిన సీతాకోక చిలుకలా ఎగురుకుంటూ...

నదిలో స్నానమాడుతూ నూలుపోగులతో జెండా ఎగరేస్తూ....

పొలికేక పెడుతూ....

16 comments:

  1. chakkani kavitha ki, vere back ground patalendukandi, nice one, keep writing.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్జీ ఆ పాట నాకు చాలా యిష్టం..అలానే నా కలలయామినిక్కూడా..

      Thank you

      Delete
  2. ఒంటరితనం అక్షరాల రెక్కలు కట్టుకొని
    మీ బ్లాగ్ లో వాలిపోయినట్లుంది....
    చాలా బాగుంది వర్మ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  3. నాలోని భావాలని మీరు అక్షర రూపం ఇచ్చారు ధన్యవాదములు వర్మ గారు..

    ReplyDelete
    Replies
    1. @ప్రిన్స్ గారు.. మీ సహానుభూతిని పంచుకున్నందుకు ధన్యవాదాలు...

      Delete
  4. Replies
    1. @చెప్పాలంటే...థాంక్సండీ..

      Delete
  5. వర్మగారు....చక్కని బ్లాగ్ & చిక్కని పోస్ట్, భలేరాసారు.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణగారూ మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  6. వర్మ గారు, మీ బ్లాగ్ లూక్ ఇప్పుడు చాలా బాగుంది. మీ కవితలు అన్ని బాగుంటాయి! ఈ కవిత కూడా చాలా బాగుందండి..

    ReplyDelete
    Replies
    1. woh...థాంక్సండీ మీ అభిమాన స్పందనకు జలతారు వెన్నెలగారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...