Friday, April 27, 2012

మన్నించు నేస్తమా


నీ పరిచయంతో
ఎన్నో వేసవిల తరువాత
కురిసిన వాన చినుకులలో
తడిసినట్టుగా గుండే ఝళ్ళుమన్నట్టై
ఎన్నటికీ వీడని స్నేహ బంధంగా
బాసలు చేసుకుంటూ
పయనిస్తున్న వేళ
ఓ చిరు మాటతో
నిన్ను నేను
బాధించాను...

నాలుక జారిన మాట
వెనక్కు తీసుకోలేనిది...

అయినా
పుడమి వలె ఓరిమి
సొంతమైన నీవు
క్షమిస్తావని
ఆశగా
ముకుళిత హస్తాలతో
నీ ముందు...

5 comments:

  1. మాటలతో వచ్చిన చిక్కే ఇది..
    ఎప్పుడు అతుకేస్తాయొ..
    యే నిమిషాన.. దూరం చేస్తాయో తెలీదు..
    చేయగలిగింది ఎమీ లెదు..
    ఓరిమి తొటి వాన చినుకులాంటి ఓదార్పు కొసం ఎదురు చూదటం తప్ప..

    ReplyDelete
  2. బాధ పెట్టింది ఎవరినైనా నీ మాటతో .....నీ ఈ వేదన చూసి కరిగి పోని వారుండరు రాజా ....తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకోవాలనుకోవడం ప్రాణానికన్నా ప్రేమకి విలువనివ్వడం నాకూ ప్రాణమే నీకు తెలుసు...నీ చేత మాట పడిన దెవరైనా కానీ ఓ మంచి కవితతో ఆమెను ఇంతలా వేడుకున్నాకా నీకు దూరంగా ఉండడం అసాధ్యం .....ప్రేమతో....జగతి

    ReplyDelete
    Replies
    1. @dhaathri: చేరవలసిన వారికి చేరుతుందనే ఆశతోనె ఈ వేడుకోలు..పంచుకొని ఆశ కల్పించినందుకు థాంక్యూ జె..

      Delete
  3. భాధపెడితే పెట్టారు కానీ...ఆ భాధలో కమ్మని క్షమించమని చెప్పే కవిత్వం చెప్పారు:-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...