Wednesday, October 9, 2013

చినుకునలా...



చినుకునలా
రాలనివ్వండి

నేల

ఒడిలో
సేదదీరి
ఇంకి
ఇరిగి
తిరిగి
తన
మాతృ
గర్భంలో
చేరనివ్వండి

కొన్ని
పూవులనలా
పుష్పించనివ్వండి

రెక్కలు
రంగులు
తొడిగి
ఇంద్రధనస్సును
వంచి
నేలకు
దిగనివ్వండి


గాలినలా
వీయనీయండి

వెదుళ్ళ
వనంగుండా

సున్నిత
రాగాన్నలా
గొంతులో
పల్లవిస్తూ
దిక్కులన్నీ
విననివ్వండి


పాదాలనిలా
నడవనివ్వండి

అలుపెరుగని
పయనంలో
ఆరేడు
ఋతువులగుండా
వెలుగు
నీడల
మెరుపుల
మద్య
ఇన్ని
కన్నీళ్ళను
తుడవనీయండి

(తే 09-10-2013 దీ 7.57PM )

7 comments:

  1. Wonderful feel!!

    ReplyDelete
  2. వెలుగు
    నీడల
    మెరుపుల
    మధ్య
    ఇన్ని
    కన్నీళ్ళను
    తుడవనీయండి

    నిజమే....స్వేచ్చనీయండి...
    ....ఎంత చక్కగా చెప్పారు....

    ReplyDelete
  3. ఈ.....
    చక్కని భావల
    చిక్కని కవితల్లాంటివి
    మీరు రోజుకొకటి రాస్తూ
    మమ్మల్ని ఆస్వాధించనీయండి!

    ReplyDelete
    Replies
    1. మీరిలా చెప్తూంటే రాయకుండా ఉండగలనా?? థాంక్యూ పద్మార్పిత గారూ..

      Delete
  4. చక్కనైన చిగులాంటి కవిత. బాగుందండి

    ReplyDelete
  5. మీకవిత చినుకులా రాలి వరదలై పారాలి :)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...