Friday, June 15, 2012

కలలయామినిలో..


నిన్ను మరిచిందెప్పుడు ప్రియా?

సుషుప్తిలో కనురెప్పలకావల
స్వప్న సాగరంలో కలల
అలల సహపయనం...

జాగృతిలో ఉఛ్వాశ నిశ్వాశల
జుగల్బందీలో
నీ ఊహల పంజరంలో
బంధీని కానా?

ఓ రహస్యం చెప్పనా!
చెవిలో గుస గుసగా
గుండెకు చేరువుగా
మనసుకు మక్కువగా...

అదే నీవెరిగినదే
మరొక్క సారి
ఇలా...

అలా పావురం
రెక్కల అలికిడిలా
మృధువుగా...

నెమలీకతో
నిమిరినట్టుగా
హాయిగొలిపేలా....

తేనె రంగు కనులపై
ఓ తీయని చుంబనంలా...

కలువ రేకుల
మెరుపుదనం
కనురెప్పలకద్దినట్టుగా
...

చేతికందిన
వెన్నెల చల్లదనం
చెక్కిలిపై పూసినట్టుగా...

ఎప్పుడైనా ఇదే మాట కదా..
నువ్వే
నా నువ్వే!!!

24 comments:

  1. చాలా చాలా బాగుంది అక్షరం అక్షరం అనుభవైకవేద్యంగా ..

    ReplyDelete
    Replies
    1. @వనజవనమాలి గారూ ధన్యవాదాలండీ...

      Delete
  2. వావ్.........చాలా బాగుంది..!!

    ReplyDelete
  3. అన్ని అందాలని మీరే పంచేసుకుంటే ఇంక మేమేమైపోవాలండి వర్మగారు:-)
    అందంగా, కమ్మగా, కమనీయంగా ఉందండీ కలలయామినితో మీ యానం!

    ReplyDelete
    Replies
    1. నిజమా...!!
      మీ ఆత్మీయ స్పందనే ఊపిరి కదా పద్మార్పితగారూ...థాంక్యూ..

      Delete
  4. ఎంతటి కోమలియో కదా ఆమె! :)

    ReplyDelete
    Replies
    1. అంతే కదా ప్రేరణ గారూ...:D
      థాంక్యూ...

      Delete
  5. చాలా బాగుంది... అండీ...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ సాయిగారూ..

      Delete
  6. చాలా బావుంది .ఈ లైన్లు నాకు బాగా నచ్చాయి

    జాగృతిలో ఉఛ్వాశ నిశ్వాశల
    జుగల్బందీలో
    నీ ఊహల పంజరంలో
    బంధీని కానా?

    ReplyDelete
    Replies
    1. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారూ థాంక్సండీ..

      Delete
  7. పదునైన పదాల కూర్పు...
    కవితలలో చక్కని భావాలని చేర్చే నేర్పు...
    మీ సొంతం వర్మ గారూ!
    చాలా బాగుంది.
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ కవితాత్మీయతకు శ్రీగారూ..

      Delete
  8. చేతికందిన
    వెన్నెల చల్లదనం
    చెక్కిలిపై పూసినట్టుగా...
    chaalaa chakkaga chikkaga undandi.

    ReplyDelete
  9. premanu minchina pennidhi undadu elantivarainaa premalo .....nice ...love j

    ReplyDelete
  10. ప్రేమలోని పచ్చదనం అంతా మీ బ్లాగ్ లోను కలలయామినిలో....బాగుందండి:)

    ReplyDelete
    Replies
    1. సృజన గారూ ధన్యవాదాలండీ..

      Delete
  11. wow so romantic poem...i think you are becoming an romantic hero sir:)

    ReplyDelete
    Replies
    1. Hi Aniketh..I'm not a romantic hero..Just I compete with you..:-)

      Thanks for your lovely presence here..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...