Thursday, October 3, 2013

ఒకసారి....

మాటాడుకోవాలి మనం
కాలాన్ని కారు మేఘమేదో
కమ్మేయకముందే

నగ్నంగా
దేహాంతర్భాగంలోని
ఆత్మో నిశ్శరీరమో
యిరువైపులా
మోకరిల్లి
గుహాంతర్భాగంలోని
పులి చంపిన
నెత్తుటి తడినింత
పూసుకొని
చావు వాసనేదో
కమ్ముకుంటున్న
క్షణాల మధ్యనుండి
చిట పట చిట పటమని
ఎగసిపడుతున్న
జ్వాలా రేఖల చివుళ్ళ
మధ్యనుండి
రాలిపడుతున్న
బూడిదనింత
పూసుకొని
ఎదురెదురుగా
కూచుని
మాటాడుకోవాలి

కరవాలాలన్నీ
ఒరలో సర్రున
జారుతూ
పక్కటెముకలను
తెగ్గోస్తున్నా
నవ్వుతూ
మాటాడుకోవాలి

అనంత
సాగర ఘోషనెవరో
పుక్కిట బంధించి
ఒక్కసారిగా
కొమ్ము బూరలోంచి
యుద్దారావం
చేయకముందే
ఒకసారి
మాటాడుకోవాలి


(తే 1-10-13దీ రా.11.11)

4 comments:

  1. నగ్నంగా
    దేహాంతర్భాగంలోని
    ఆత్మో నిశ్శరీరమో
    యిరువైపులా
    మోకరిల్లి....ఎదురెదురుగా
    కూచుని
    మాటాడుకోవాలి.....నిజమే, ముందుగా ఎవరు మొదలెట్టాలో మరి ???

    ReplyDelete
    Replies
    1. ఎవరు అన్న ప్రశ్నకు తావు లేదుకదా ఆ క్షణం..:-)
      థాంక్సండీ పద్మార్పిత గారూ..

      Delete
  2. అందరూ మీలా మాటలాడుకోవాలి అని ఆలోచిస్తే ఇన్ని గొడవలు ఉండవేమో వర్మగారు! చాలా బాగుందండి

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...