Monday, October 29, 2012

ఆకాశ నేత్రమై...

నువ్వలా సడి లేకుండా వస్తావని
కనురెప్పల వాకిలి తెరచి వుంచా...

అత్తరులా దేహమంతా
పరిమళిస్తావని...

వెన్నెలంత చల్లదనాన్ని
నుదుట చుంబిస్తావని...

వెచ్చని కలవరింతవై
కరుణిస్తావని...

కలల యామినిలా
దరి చేరుతావని...

ఆత్మ బంధమేదో
సంకెల వేయగా....

కన్నీటి నదిని
ఎదురీది....

యుగాల నిరీక్షణ
అంతం చేయగా...

దేహమంతా ఆకాశ నేత్రమై
వేచి చూస్తున్నా.....

16 comments:

  1. ఆసావహి ....అద్భతం...నూతక్కి

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ గురూజీ..చాలా రోజుల తరువాత మీ రాక..ఆనందంగా వుంది..

      Delete
  2. దేహమంటా నేత్రంగా చూసే మీ చూపు వాడికి....
    వాకిలంతా పరచిన మీ ప్రేమ పరిమళాలకి...
    దాసోహంలెండి మీ కలలయామిని:-)

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయవచనాలకి ధన్యవాదాలు పద్మార్పిత గారూ..

      Delete
  3. ఎదురుచూస్తూనే ఇంతలా రాసేస్తుంటే....
    నిరీక్షణ ఫలిస్తే?? అబ్బో అదరగొట్టేస్తారేమో!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ అనికేత్..చూద్దాం...

      Delete
  4. ఆకాశనేత్రంలో ఆ జాబిలి వచ్చి వెన్నెల కురిపిస్తుంది, తప్పక...
    బాగుంది కవిత.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనలకు ధన్యవాదాలు చిన్ని ఆశ గారు..

      Delete
  5. వర్మ గారూ, అస్సలు ఈ కలలయామిని అనే ప్రయోగమే నిరీక్షణకు పరాకాష్ట.
    మీ కవితల్లో మంచి పదాల సోయగం ఉంటుంది. అదే సామాజిక కవితలు అయితే ఇంకా బాగుంటాయి.
    ఇకపోతే ఈ కలలయామిని యే మింటిన రంగుల హరివిల్లుపై విహరిస్తుందో,

    ReplyDelete
    Replies
    1. ఫాతిమాజీ కలలయామిని నా తలపైనున్న ఆకాశంలో రంగుల హరివిల్లై విహరించాలనే కదా ఆశ...
      మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు...

      Delete
  6. గొప్ప నిరీక్షణ,.బాగుందండి.

    ReplyDelete
  7. ఇంకా వేచిచూస్తున్నారంటే నేను నమ్మనండి....ఇంతలా నిరీక్షితున్నారని తెలిసాక ఎవరైనా రాకుండా ఉండగలరా???....ఈ పాటికి మీ కలల యామిని మీ ధరి చేరి ఉండాలి....చాల బాగుంది వర్మ గారు :)

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ యింకా నిరీక్షణలోనే వున్నా కావ్యాంజలి గారు...
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు...:-)

      Delete
  8. చూపులుకన్న ఎదురుచూపులుమిన్న.....
    అలాగే నిరీక్షణ లోవున్న ఆనందం,అనుభవం కన్నా అనుభూతి కన్నా కూడా బావుంటుంది.
    మీ కలలయామిని,మీ స్వప్నసుందరి గురుంచి ఇంకా ఇంకా మీ నుంచి కవితలు రావాలని
    అలాగే వెన్నలయామినిసాక్షాత్కారము కూడా కలగాలని........

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయాశీర్వచనం ఫలించాలని కోరుకుంటూ...
      ఇంత మంచి కామెంటు రాసి స్ఫూర్తినిచ్చినందుకు many many thanksandi పూర్వ ఫల్గుణి(poorva phalguni) గారు...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...