Thursday, September 13, 2012

నిశ్శబ్ధాలాపన..


ఒక్కో అక్షరమూ దేనికదే విడివడి
అంటిన రక్తపు మరకల జిగురును వదిలించుకుంటుంటే...

మగ్గంపై నేస్తున్న నార వస్త్రంలా
ఒక్కో దారప్పోగూ దేనికదే చిక్కుముడిలా...

అద్దుతున్న ఏ రంగూ
కుంచెనుండి కాగితంపై ఒలకక....

ఒడ్డున కాలికంటుతున్న ఇసుక రేణువుల్లా
దేనికదే శిలలా కరగనితనంతో...

దోసిలి సందులలోంచి ఒక్కో నీటి బొట్టూ
జారిపోతూ తడి ఇగిరిపోతూ....

గాలి వీయనితనమేదో
గుండె అరలలో ఉక్కపోతను ఆరబెడుతూ...

మూగబోయిన గొంతు నుండి సన్నని జీరలా
ఓ రాగం తనలో తానే ఇంకిపోతూ నిశ్శబ్ధాన్ని ఆలపిస్తూ...

26 comments:

  1. భావాలు పలకనితనాన్ని ఆర్ధ్రంగా పలికించేసారండి.అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ఎన్నాళ్ళకి భాస్కర్ గారి అభినందనలు...ధన్యవాదాలు సార్...

      Delete
  2. మీరే ఇలా నిశ్శబ్ధం అంటే మేమేం రాస్తాం కవివర్మగారు:-)
    పోస్ట్ అదిరింది.

    ReplyDelete
    Replies
    1. నిశ్శబ్ధావరణంలోనే శ్రావ్య సంగీతం రాగ రంజితమవుతుంది కదా పద్మ గారూ...:-)
      అదిరిందన్న మీ స్పందన స్ఫూర్తి కదా నాకు.. ధన్యవాదాలు...

      Delete
  3. varma garu aksharam moogapotoo mowna bhaaavaanii baagaa palikindi.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ అక్షరం పలికిన భావ స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ..

      Delete
  4. Excellent! Too good.. చాలా బాగుంది వర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. మీ బాగుందన్న మాటకు మనఃపూర్వక ధన్యవాదాలు వెన్నెల గారూ...

      Delete
  5. నిశ్శబ్ధంగా వుండడం నావల్ల కాదండోయ్..
    బాగుందండీ వర్మ గారూ...

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ వడ్రంగిపిట్ట గారూ..

      Delete
  6. మౌనంగా సాధించ వచ్చని మీరనుకున్నా మీ అక్షరాలు మిమ్మల్ని అలా ఉండనీయవులెండి:) చాలాబాగా పలుకుతాయవి.

    ReplyDelete
    Replies
    1. నాది మౌన పోరాటం కాదండీ అక్షర యుద్ధం సృజన గారూ...:) thanks a lot...

      Delete
  7. మంచిమనసుతో మన్నిస్తారని ఇలా......ఎప్పుడూ ఒంటరిగా నిర్లిప్తంగా, నిశ్శబ్దంగా ఒక్కరికోసమే ఈ తపన ఎందుకు చెప్పండి, అలా బయట ప్రపంచంలోకి వస్తే కోకొల్లలు:)

    ReplyDelete
    Replies
    1. ఈ అంతర్జాల ప్రపంచంలో మీవంటి మిత్రులుండడం నా అదృష్టం కదండీ అనికేత్..:)
      thank you very much..

      Delete
  8. నిశ్శబ్దంలోని నీ శబ్దమై రాగరంజితమౌతూ.... శిలలాంటి అక్షరాలు భావుకతా శిల్పమౌతుంటే అనిమేష వీక్షణాలతో అభిషేకిస్తూ......అలా జారిపోతున్నాం మీ కవితా ఝరిలో సాగిపోతున్నాం...కవి వర్మాజీ.....

    ReplyDelete
    Replies
    1. మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు spoorty గారు..

      Delete
  9. నిశ్శబ్ధ రాగంలో నుండి ఉద్భవించే అనురాగాన్ని ఆస్వాధించడం అలవరుచుకుంటే అదే బాగున్నట్లనిపిస్తుందేమో కదండీ:)

    ReplyDelete
    Replies
    1. అనురాగాన్ని ఆస్వాదించే హృదయ స్పందనకు ప్రేరణ కదా మీ వ్యాఖ్య...ధన్యవాదాలు ప్రేరణ గారు..

      Delete
  10. మీ నిశ్శబ్ధాలాపన ఎన్ని ఊసులు చెప్పిందండి. బాగుందండి.

    ReplyDelete
  11. మౌనం గానం మధురం..... మీ కవిత చదవగానే ఈ పాట గుర్తుకొచ్చింది మీ కవిత అద్భుతంగా ఉంది వర్మ గారు

    ReplyDelete
    Replies
    1. నా కవిత ఓ మధుర గీతాన్ని గుర్తుచేసినందుకు ఆనందంగా వుంది..మీ కాంప్లిమెంటుకు ధన్యవాదాలు veenaa lahari గారు..

      Delete
  12. మూగబోయిన గొంతు నుండి సన్నని జీరలా
    ఓ రాగం తనలో తానే ఇంకిపోతూ నిశ్శబ్ధాన్ని ఆలపిస్తూ...
    ఎంత అద్బుతమైన భావం
    నిశ్శబ్దం కూడా ఓ expression.అందులో కూడా మీ కవిత మరింత పదును చూపించింది.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు oddula ravisekhar గారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...