Sunday, February 12, 2012

వల్మీకం..




ఔను

ఇప్పుడు నిలుచున్న చోటనే
ఓ కందకం తవ్వబడుతోంది...

కట్టుకోని కళ్ళగంతలు
చూపును మూసివేస్తూ
లేని గుడ్డితనం నటిస్తూ...

ఎక్కడికక్కడ సంకెళ్ళు
తగిలించుకుంటూ ఒరిసిన
బాధను ఆస్వాదిస్తు....

ఎవరికి వారే ఓ వల్మీకమై
దాగిపోతూ చెదపట్టుతు...

చెవులలో హోరును
గుండెకి చేరకుండానే
నియంత్రిస్తు...

దేహమంతా కప్పుకున్న
రబ్బరు తొడుగుతో
స్పర్శ కోల్పోతూ....

8 comments:

  1. మీ కవిత హృదయాన్ని మేల్కొలుపుతోంది

    ReplyDelete
    Replies
    1. @భావరాజు గారూ మీ స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  2. నేనూ నాదను వాద౦
    అనుక్షణం జపిస్తూ
    సర్వం కోల్పోతూ...

    ReplyDelete
    Replies
    1. @జ్యోతిర్మయిః అక్కా ధన్యవాదాలు...

      Delete
  3. ఎవరికి వారే ఓ వల్మీకమై.... chalaa baagundandee!!!

    ReplyDelete
  4. వల్మీకం
    వాల్మీకి అయి
    జనావళీ యానికి
    యానం అయ్యే రోజులు ఎప్పుడు వస్తాయో

    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. @Zilebi గారు మన ఆశ ఫలించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...