తను...
ఎందుకంటే ఏమి చెప్పను?
ఎన్నో చెప్పాలనుకుంటాను
ఏదేదో చెప్పేస్తూ ఉంటాను
చెప్పాలనుకున్నవి చెప్పను
మిమ్మల్ని విసిగిస్తూ వాగేస్తాను
మార్చుకోవాలనే ప్రయత్నిస్తాను
రేయంతా మనసుని మభ్యపెడతాను
మొరాయిస్తున్న మనసుని జోకొడతాను
ఉదయాన్నే కాస్త మౌనం దాలుస్తాను
నిముషంలో నిర్ణయం మార్చుకుంటాను
ఎందుకిలా అనడిగితే ఏమని చెప్పను?
ఇది ఎందుకో ఏమో అని ఎలా చెప్పను?
నేను...
నేను అంతే
మాటాడుతూ ఒక్కసారిగా మూగగా ఐపోతుంటాను
మాట రాని మౌనమేదో కమ్ముకుని
నాలో నేను దాగిపోవాలని
ఓ విఫలయత్నం చేస్తుంటాను
కానీ
నీ ఊహ గుహాంతర్భాగంలోంచి
దూసుకొచ్చిన వేట పులిలా కమ్ముకొని
ఒక్కసారిగా ఆవహించి
నిలువనీయదు కదా...
అది తప్పో ఒప్పో
మనసు ఒప్పుకోదే..
ఇది తప్పొప్పుల మీమాంస సమయం కాదని
హృదయ లయలలో ఓ రాగం సన్నగా
మీటుతుంది...
ఇంక ఉప్పొంగిన నెత్తురు
లావాల విరజిమ్మి ఒక్కసారిగా
ముందుకు నెడుతుంది....
అప్పటికి నీవు అప్పుడప్పుడు
ఎగరేస్తున్న ఎర్ర జెండా కంటికి
అగుపడదే....
ఇలా చెప్పుకుంటూ పోతే
హృదయం తేలికవుతుందా...
లేదే...
మరింత గాఢమైన వనంలోకి
చొరబడ్డ దారితెలియని జింకపిల్లలా
విల విలలాడుతూ
దాహార్తితో
నీ ముందు దోసిలితో...
(ఓ రెండు హృదయాల సంభాషణ)
vowwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww...love j
ReplyDeleteThank u J..
DeleteSuper chalabagundi..........
ReplyDeleteసాయి గారు థాంక్యూ సార్..
Deleteబావుంది వర్మాజీ ఓ ఇద్దరి మనసుభాషని విని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు....నేచురల్ గా ఉంది
ReplyDeleteనేచురల్...థాంక్యూ వాసుదేవ్జీ...
Deleteమీ మాటల నిండా మౌనమే..
ReplyDeleteమౌనం నిండిన మాట హృదయం మాత్రమె అనువదించ గలదు..
వెన్నెలలా పరుచుకున్న మౌనం మాటలంత ప్రస్ఫుటం.. మీ కవితలో కుమార్ గారు..
మీ ఆత్మీయ స్పందనతో పరిపూర్ణతనిచ్చినందుకు ధన్యవాదాలు మేడం...
DeleteSuper like :) chaaaaaaaalaaaa bavundi varma ji
ReplyDeleteThank u Vijayabhanuji...
Deletehridaya ghosha enthacheppina inka migilipothundi, kaani paripoornmaina saili meedi
ReplyDeleteMeeraj Fathima గారూ థాంక్సండీ...
Delete