Thursday, February 9, 2012

ఆమె నవ్వుతోంది...



ఆమె నవ్వుతోంది

ఎదురుగా కూర్చొని కాసిన్ని
పల్లీలు నములుతూ నీవు
లేకుండా వుండలేను అంటే...

ఆమె నవ్వుతోంది
కాలికింద ఇసుకను కోస్తూ
ఓ అల అలా వెళ్ళిపోతుంటే
చూస్తూ...

ఆమె నవ్వుతోంది
విసురుగా వచ్చిన గాలి
ఆమె ముంగురులను తాకి వెళ్తే
అసూయగా చూసిన నా కళ్ళలోకి చూస్తూ...

ఆమె నవ్వుతోంది
నువ్వు నా చేయి వదిలితే
సూరీడుతో పాటు అలా ఆ కొండ
వెనక్కి చేరుకుంటానంటే....

ఆమె నవ్వుతోంది
కాసింత వెన్నెలని దోసిలితో పట్టి
నీ నుదుటనలంకరిస్తానంటే....

ఆమె నవ్వుతోంది
ఊపిరాగిన క్షణం కూడా
నీ పేరే తలుస్తానంటే...

ఆమె నవ్వుతోంది
నా చేతులలోంచి
జారిపడిన ప్రేమలేఖ చూసి...

ఆమె నవ్వుతోంది
ఒంటరిగా నే నడిచి
వెళ్తుంటే....

15 comments:

  1. ఎవ్వరా మదిని దోచిన చిన్నది?:-)
    నవ్వుతూ నీడలా మీవెంట ఉంది:-)
    ఇంక మీకేల ఈ ఒంటరితనమంది:-)

    ReplyDelete
    Replies
    1. @పద్మార్పిత గారూ మీ కవితాత్మక ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.ః-)

      Delete
  2. mmmmm aame navvadaa mari nee pirikithanam chusi ....hahaha love urs j

    ReplyDelete
  3. ఆ నవ్వులు సదా మీ
    ఎద కనుమల్లో ప్రతిద్వని౦చాలి

    ReplyDelete
    Replies
    1. @దర్పణం గారూ మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు...

      Delete
  4. చాలాబావుందండీ .

    ReplyDelete
  5. నవ్వదా మరి అప్పుడుకూడ పల్లీలు తినటం మానకపోతే....ఆదొక్కటీ తప్ప కవిత అంతా భావుకత్వం పొంగిపొర్లింది సర్.ఆమె నీడసైతం మీకు ప్రేమస్ఫూర్తిదాత అవ్వాలని కోరుకుంటున్నా.

    ReplyDelete
    Replies
    1. పల్లీలు తింటే కొలెస్టరాల్ పెరుగుతుందనా..పర్వాలేదు వాసుదేవ్జీ...ఏదో కాస్తా లైవ్లీగా వుంటుందని మొదలుపెట్టా అలా...మీ ఆత్మీయతకు ధన్యవాదాలు...

      Delete
  6. కాసింత వెన్నెలని దోసిలితో పట్టి... పదాలుగా చిలకరించి.. మనసున వెన్నెల కురిపించారు కుమార్ గారు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...