
నమ్మవు కదా నీవు!
ఏం చెప్పినా ఏదో అపనమ్మకం...
మనిషిని చేసావు అంటే
కళ్ళలోకి సూటిగా చూసి
రెటీనా పై వాలిన బొమ్మను కూడా
ఎక్స్ రే తీస్తానంటే ఎలా??
ఏమని చెప్పుకోను!
గుండె లయను
ఇసిజితో కనిపెట్టగలవా??
నీకు వినబడేది లబ్ డబ్ మాత్రమే
కానీ లోలోపల గదులన్నీ
బీటలు వారుతూ...
కన్నీళ్ళను కూడా లిట్మస్ పరీక్ష చేసే
నీకు!
అనుబంధాన్ని అంతరంగాన్ని
ఆవిష్కరించే ప్రయోగశాల వుందా...
మూగబోతున్న ఎద చివరి మాటగా
నీవు తప్ప తోడు లేదని
గుండెలోతుల్లోంచి పలికిన మాటను
కూడా శల్య పరీక్షకు గురిచేసినా
గొంతు మారదే...
ఎందుకంటే ఏం చెప్పను!
ఎలా చెప్పను!
ఒక్కసారిగా తెగిపోయిన
వయొలిన్ రాగమాలపించడం
ఎంత వ్యధభరితమో తెలియనిదా నీకు??
నాకు ఆది అంతం నీవే
పగిలిన గుండెను అతికేట్టుగా
మమతతో పో......రా....అంటూ
రా రమ్మనరాదా!!
కలల తెరచాపలో తోడుగా...
(19.2.2012 11PM)
**నాకు ఆది అంతం నీవే
ReplyDeleteపగిలిన గుండెను అతికేట్టుగా
మమతతో పో......రా....అంటూ
రా రమ్మనరాదా!!**ఎమన్నా అది ప్రేమకే... ప్రేమతో... చెల్లింది!
@Jayasree Naidu గారూ ధన్యవాదాలు...
ReplyDeleteమీరీ పోస్ట్ కి పెట్టుకున్న బొమ్మ మేము స్వయంగా గీసుకున్నది, http://chinniaasa.blogspot.com/2011/12/blog-post_22.html. చూడండి.
ReplyDeleteపెట్టుకుంటే పెట్టుకున్నారు, కానీ అందులో ఉన్న signature erase చేసి పెట్టుకోవటం మంచి పద్ధతి కాదు. బొమ్మవేసిన వాళ్ళకి credit ఇస్తూ ఒక్క మాట చెప్పి పెట్టుకోవటం లేదా పెట్టుకునే ముందు అడిగి పెట్టుకోవటం పద్ధతి. మంచి poetry రాస్తున్నారు. అడిగితే సంతోషంగా పెట్టుకోండి అనేవాళ్ళం....
@ఛిన్ని ఆశ గారు సారీ..మీ చిత్రమని నాకు తెలీదండీ...ఓ మిత్రులు సూచిస్తే వుంచుకున్నా...మీ సూచనతో తొలగించా...
DeleteTouching varma ji....
ReplyDeleteThank u Bhanuji..
Deleteచాలా బాగుందండీ..
ReplyDeleteమధురవాణి గారూ థాంక్యూ...
ReplyDelete