దిక్కులన్నీ చుట్టేస్తూ సుదూర తీరాలకేసి పరుగులు తీస్తూ అలసిపోయాను...
ఎందాకా వెళ్ళినా నువ్వే ఎదురవుతున్నావు!
నీలాల నింగిలో..
నిండుగా నిశ్చలంగా ఉన్న నీటి కొలనులో..
ఆవేశంగా ఎగిసిపడే కడలి కెరటాలలో..
అన్నిటా అంతటా నువ్వే!
గట్టిగా కళ్ళు మూసుకుని చీకటి లోయలోకి జారిపోయాను..
ఆశ్చర్యం!
అంతటి చిక్కటి చీకటిలోనూ నువ్వు స్పష్టంగా కనిపిస్తున్నావు..
శ్వాస మీద ధ్యాస నిలిపి ధ్యానం ఒడిలో సేద తీరాలనుకున్నాను..
చిత్రం!
నా ఊపిరి సవ్వడిలో నీ నామ జపమే వినిపిస్తోంది!
నా మనసుని శూన్యంలోకి నెట్టేయ్యడానికి విశ్వప్రయత్నం చేశాను..
విచిత్రం!
నీ జాడ లేని శూన్యమైనా నా చేతికి దొరకలేదు..
గుండె చిక్కబట్టుకుని చివరి ప్రయత్నంగా మౌనాన్ని ఆశ్రయించాను..
ఆ నిశబ్దంలో
నా గుండె చప్పుడులో నీ ఊసులు వేయింతలై వినిపిస్తున్నాయి!
నీ మీద నుంచి నా ధ్యాస మరల్చాలనే ప్రయత్నం
వృథాగా మిగిలిపోతోంది..
ఇలా బాధపడాలనే ఋణమేదో మనిద్దరికీ మధ్యన ఇంకా మిగిలి ఉంది!?
నాలో కరిగిపోయి కలిసిపోయిన బంధానివి నువ్వు..
నేనంటూ ఉన్నదాకా నీ నుంచి నేను తప్పించుకుపోలేననుకుంటా!
antarangamlo pratishitinchabadina aasammohana roopam pournaminaati venneladaarilo anta vedikina kanipinchadu.voohalu, voosulu vooradinchavachu.
ReplyDeleteThank u bangaRAM gaaru..
ReplyDeletemmmmmmmmmmmmmmmmmm kaanivvandi teevravadula prema kuda teevrame hahahahha
ReplyDeletethank u J...yem chestaam meekanamannaaru......
Delete"నా మనసుని శూన్యంలోకి నెట్టేయ్యడానికి విశ్వప్రయత్నం చేశాను..
ReplyDeleteవిచిత్రం!
నీ జాడ లేని శూన్యమైనా నా చేతికి దొరకలేదు.."
చాలా నచ్చిందండి!
Padmarpita గారు మీకు నచ్చిందంటే యింక ఆ జాడ దొరికినట్టేః-)
ReplyDeleteథాంక్యూ...
మనస్సును పరచినట్టు అంతరంగాన్ని చదువుకున్నట్టు బాగుంది. కాదు చాలా బాగుంది
ReplyDelete