ఎప్పుడూ మెడపై ఓ అపనమ్మకపు
కత్తి వేలాడుతూనే వుంటుంది!
దీనికంటే ఉరి నయం కదా...
మనుషుల మధ్య ఓ
తెల్లని పొరలాంటిదేదో మసకగా
ఏర్పడి వేరుచేయడం
ఎంత విషాదమో కదా..
చిర్నవ్వుల మధ్య
ఏదో దాగున్న నిశ్శబ్ధం మౌనంగా
రోధిస్తుంటే భాధే కదా..
కలకూ కలకూ మధ్య
మెలకువలో ఓ ఉలికిపాటు
తెరచాపనెవరో చించిపారేసి
నడిసంద్రంలో నావను ముంచేసినట్టు
దూరానికి దూరానికి మధ్య
గీసిన సరిహద్దు రేఖల కావలి
కాదా ఈ నిట్టూర్పు!
నిజంగా మీ అంతరగంలో అంత నిట్టూర్పాండి??
ReplyDeleteపద్మగారూ అంతరంగంలోని భావ సాంద్రత మీకు తెలియనిదా....ధన్యవాదాలు...
Delete